Godavari floods Updates: ప్రస్తుతం భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు గోదావరి నీటిమట్టం భద్రాచలం వద్ద 55.40 అడుగులకు చేరింది. ప్రస్తుతం భద్రాద్రి వద్ద 15.40 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద ప్రవాహం కాస్త తగ్గడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా తగ్గుతోంది. శనివారం వరదనీరు పోటెత్తడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో నదీపరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిలిచిన రాకపోకలు..


గోదావరి ఉద్దృతంగా ప్రవహించడంతో భద్రాచలం స్నాన ఘటటాల ప్రాంతం వరద నీటిలోనే మునిగి ఉంది. భద్రాచలం నుంచి ఛత్తీస్ గఢ్ వెళ్లే జాతీయ రహదారిపై వరదనీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం వెళ్లే మార్గంలో రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు ఆపేశారు. భద్రాద్రి నుంచి ఏపీలోని విలీన మండలాలకు కూడా రాకపోకలు లేవు. వరద ఉద్ధృతితో మూడు రాష్ట్రాల మధ్య ప్రజా రవాణా, వాణిజ్య రవాణా పూర్తి నిలిచిపోయింది. వందల సంఖ్యలో వాహనాలు రోడ్లపైనే ఉండిపోయాయి. 


వరద బాధితుల ఆందోళన..


భద్రాచలం పట్టణంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వరద బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భోజనాలు సరిగా అందించడం లేదంటూ వారంతా ఆందోళనకు దిగారు. రెవెన్యూ అధికారుల సర్ది చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక హెలికాప్టర్ లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అంతేకాకుండా పునరావస కేంద్రాలకు వెళ్లి బాధితులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. దాదాపు 12వేల మంది వరద బాధితులు పునరావాస కేంద్రాల్లో ఏ ఇబ్బంది లేకుండా ఉన్నారని ఆయన చెప్పారు.


Also Read: Uttam Kumar Reddy: బీఆర్ఎస్‌లో చేరికపై ప్రచారం.. బాంబ్ పేల్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇది ఆయన పనే..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook