Godavari water level at Bhadrachalam: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి గోదావరి నీటిమట్టం 53.1 అడుగులకు చేరింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. అంతేకాకుండా ఇదే చివరి ప్రమాద హెచ్చరికగా పేర్కొన్నారు. ప్రస్తుతం 14, 32, 336 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. రాత్రి 10 గంటల సమయానికి భద్రాచలం వద్ద నీటి మట్టం 53.2 అడుగల వద్ద ఉంది. ఇది క్రమేపీ 56 నుంచి 58 అడుగుల వరకు చేరే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గోదారమ్మ ఉద్ధృతంగా ప్రవహించడంతో.. నదీ పరివాహక ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో వరద నీరు నిలిచి ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. తెలంగాణ-ఛత్తీస్ గఢ్ ప్రధాన రహదారిపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.  భద్రాచలంతో పాటు లోతట్టు గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 49 పునరావాస కేంద్రాలకు 4,900 మందిని తరలించినట్టు అధికారులు వెల్లడించారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో స్నానఘట్టాల ప్రాంతం మొత్తం వరదనీటిలో మునిగిపోయింది. దీంతో గోదావరి ఒడ్డుకు ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.  


Also Read: Munneru vagu floods: ముంచెత్తిన మున్నేరు.. జలదిగ్బంధంలో ఖమ్మం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook