Gold Smuggling: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారు స్మగ్లర్ అరెస్ట్
Gold Smuggler Arrested | దుబాయి నుంచి వస్తున్న ప్రయాణికుడి నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు 71.47 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
RGI Airport | దుబాయి నుంచి వస్తున్న ప్రయాణికుడి నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు 71.47 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి హైదరాబాద్ ( Hyderabad) కు బంగారాన్ని స్మగుల్ చేయడానికి ఈ ప్రయాణికుడు ప్రయత్నించాడు. అయితే అధికారులకు సందేహం రావడంతో, అతని కదలికలను కాసేపు గమనించారు. ప్రయాణికులు హావభావాలను, అనుమానాస్పద కదలికలను బట్టి ఒక అంచనాకు వచ్చి అతన్ని అదుపులో తీసుకున్నారు.
Also Read | LPG New Rules: గ్యాస్ బుక్ చేసే ముందు ఈ కొత్త రూల్ తెలుసుకోవాల్సిందే
ప్రయాణికుడి వద్ద నుంచి 12 బంగారు బిస్కెట్స్ స్వాధీనం చేసుకున్నారు. దుబాయి ( Dubai ) నుంచి వస్తున్న ఈ ప్రయాణికుడు తన ట్రౌజర్ లో వాటిని దాచి ఉంచాడు. వీటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుంది అని సమాచారం. సదరు ప్రయాణికుడిని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు అక్టోబర్ 23న కస్టమ్స్ అధికారులు సుమారు రూ.70.95 లక్ష విలువైన బంగారు బిస్కెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అంతర్జాతీయ ప్రయాణికులు, ఒక డొమెస్టిక్ విమాన ప్రయాణికుల నుంచి ఈ బంగారం స్వాధీనం అయింది. 1.38 కిలోల బంగారాన్ని విశాఖ నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా అనుమాన వచ్చి వీరిని అదుపులో తీసుకున్నారు. దాని కన్నా ముందు సదరు ప్రయాణికుడు దుబాయి నుంచి వైజాగ్ చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ కు బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించాడు.
Also Read | Hrithik Roshan: హాలీవుడ్ చిత్రంలో నటించనున్న హృతిక్ రోషన్
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR