బంగారం అక్రమ రవాణాకు విమానాశ్రయాలు అడ్డాగా మారుతున్నాయి. వివిధ రకాలుగా, వివిధ రూపాలుగా బంగారాన్ని తరలించేస్తున్నారు. ఒక్కోసారి పట్టుబడితే..ఒక్కోసారి అక్రమ రవాణా జరిగిపోతుంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్నించి బంగారం అక్రమ రవాణా యధేచ్ఛగా జరిగిపోతోంది. వివిధ రకాలుగా, వివిధ రూపాల్లో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నా..కస్టమ్స్ చెకింగ్‌లో పట్టుబడిపోతున్నారు. ఇంకొన్నిసార్లు తప్పించుకుని..యధేఛ్చగా సరఫరా చేయగలుగుతున్నారు. ఇవాళ మరోసారి శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం భారీగా పట్టుబడింది. 


ఇవాళ కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో షార్జా, దుబాయ్ దేశాల్నించి వచ్చిన 15 మంది ప్రయాణీకులపై అనుమానం వచ్చింది. తనిఖీ చేయగా..కోటి 50 లక్షల రూపాయలు విలువ చేసే 3 కిలోల బంగారం లభించింది. ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు 15 మందిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి విమానాశ్రయాల్నించి తరచూ బంగారం స్మగ్లింగ్ చేయడం, పట్టుబడటం జరుగుతూనే ఉంది. 


Also read: Traffic New Rules: ట్రాఫిక్ కొత్త రూల్స్.. రాంగ్ సైడ్‌కి 1700, ట్రిపుల్ రైడింగ్ 1200 బాదుడే బాదుడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook