Gold ATM: పసిడి ప్రియులకు శుభవార్త.. హైదరాబాద్‌లో గోల్డ్ ఏటీఎంలు!!
Gold ATM in Hyderabad. దేశంలోనే ముందుగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో గోల్డ్ ఏటీఎంలు ఏర్పాట్లు చేస్తున్నట్లు గోల్డ్ సిక్కా సంస్థ సీఈవో సయ్యద్ తరుజ్ ప్రకటించించారు.
Goldsikka Ltd to install Gold ATM's soon in Hyderbad: బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ చేసేందుకు వచ్చిన ఏటీఎంలు రానురాను జనజీవనంలో ఓ భాగం అయిపోయాయి. ముందుగా డబ్బులు డ్రా చేసేందుకు మాత్రమే వచ్చిన ఏటీఎంలు.. ఆ తర్వాత డబ్బులు డిపాజిట్ చేసే సదుపాయం కూడా వచ్చింది. ఆపై మనీ ట్రాన్స్ ఫర్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. టెక్నాలజీ పెరిగే కొద్దీ కొత్త పుంతలు తొక్కుకున్న ఏటీఎం సేవులు.. ఇప్పుడు సరికొత్త విధంగా సేవలు అందించేందుకు ముందుకొస్తున్నాయి. త్వరలో బంగారం కోసం కూడా ఏటీఎంలు అందుబాటులోకి రానున్నాయి.
దేశంలోనే ముందుగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో గోల్డ్ ఏటీఎంలు ఏర్పాట్లు చేస్తున్నట్లు గోల్డ్ సిక్కా సంస్థ ప్రకటించింది. ముందుగా సికింద్రాబాద్, అబిడ్స్, చార్మినార్ ప్రాంతాల్లో మెుదటి విడతగా బంగారు ఏటిఎంలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏటీఎంల నుంచి యాభై గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని గోల్డ్ సిక్కా సంస్థ సీఈవో సయ్యద్ తరుజ్ వెల్లడించారు. రానున్న రెండు మూడు నెలలలో ఈ గోల్డ్ ఏటీఎంలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు దుబాయ్, యూకేలో మాత్రమే గోల్డ్ ఏటీఎంలు ఉన్నాయి.
గోల్డ్ ఏటీఎంల నుంచి బంగారం కొనుగోలు చేయాలనుకునేవాళ్లు డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఆయా కంపెనీలు అందిస్తున్న ప్రీపెయిడ్ కార్డులను సైతం ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇక బంగారం నాణ్యతకు సంబంధించిన వివరాలకు సంబంధించిన ప్యూరిటీ సర్టిఫికెట్లను కూడా బంగారం కొనే సమయంలోనే పొందవచ్చని గోల్డ్ సిక్కా ప్రకటించింది. ఒక్కో మిషన్‌లో రెండున్నర కోట్ల విలువైన 5 కేజీల బంగారం కాయిన్లను లోడ్ చేస్తామని తెలిపింది. అంతర్జాతీయంగా మార్పు చెందే బంగారం ధరలు ఎప్పటికపుడు ఏటీఎం స్క్రీన్‌లపై కనిపిస్తుంది.
భారత్‌లో గోల్డ్ మార్కెట్ సమయాలకు అనుకూలంగా ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు ఏటీఎంలు తెరిచి ఉంటాయని గోల్డ్ సిక్కా సీఈవో సయ్యద్ తరుజ్ వెల్లడించారు. 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలను ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చని తెలిపారు. దేశవ్యాప్తంగా 3 వేల టీఎంలు తన లక్ష్యం అని అయన చెప్పారు. హైదరాబాద్‌లో గోల్డ్ ఏటీఎంలు త్వరలోనే అనుబాటులోకి వస్తాయని తరుజ్ పేర్కొన్నారు.
Also Read: Today Horoscope March 18 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు చేయని పొరపాటుకు శిక్ష అనుభవిస్తారు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook