హైదరాబాద్‌ మెట్రో రైలుకు భారీస్పందన వస్తున్న నేపథ్యంలో రైళ్ల సంఖ్యను పెంచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు.  బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో  జరిగిన మెట్రో సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జనాలను భారీ స్పందన వస్తుంది కాబట్టి మెట్రో రైళ్లను పెంచేందుకు గల అవకాశాలను పరిశీలించాలని కోరారు. దీనికి స్పందించిన అధికారులు  వచ్చే ఫిబ్రవరి నాటికి ప్రయాణి కుల సంఖ్యను బట్టి రైళ్ల సంఖ్యను పెంచుతామన్నారు. ఇదే జరిగితే హైద్రాబాద్ ట్రాఫిక్ సమస్యలు కొంత వరకు తీరినట్లే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జూన్ 1 నాటికి అన్ని రూట్లలో మెట్రో రైళ్లు


మిగిలిన రూట్లకు గురించి మాట్లాడుతూ.. రెండో దశ మెట్రో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని  ..జూన్‌ 1 నాటికి అన్ని రూట్లలో మెట్రో నిర్వహించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అమీర్‌పేట-హైటెక్‌ సిటీమార్గంపై ప్రత్యేక శ్రద్ధవహస్తున్నట్లు పేర్కొన్నారు.మెట్రోస్టేషన్లలో పార్కింగ్‌ సౌకర్యాలు, స్టేషన్ల నుంచి ఫీడర్‌ బస్సులు, మెట్రోభద్రత కోసం పోలీసు శాఖ సహకారం తీసుకోనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు.