Govt Jobs Telangana 2022: తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. కొంతకాలంగా వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులు సీరియస్‌గా వాటిపై దృష్టిపెట్టారు. అంతా ఆన్‌లైన్‌లోనే సాగుతుండటంతో వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తులు చేసుకుంటున్నారు. కోచింగ్‌ సెంటర్ల దగ్గర క్యూలు కడుతున్నారు. అయితే, పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు  చేసుకుంటున్న వాళ్లను ఫేక్‌ వెబ్‌సైట్లు వెంటాడుతున్నాయి. వీటిపై పోలీసులకు, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు కూడా ఫిర్యాదులు అందాయి. ఇలాంటివాటిపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టారు. ఫేక్‌ వెబ్‌సైట్లను డిలీట్‌ చేయించే పనిలో నిమగ్నమయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో గ్రూప్స్‌, మిగతా ఉద్యోగాలతో పాటు.. భారీగా పోలీసు ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్‌ వెలువడింది. పోలీసు, ఎక్సైజ్‌ విభాగం, అగ్నిమాపక విభాగం, జైళ్లశాఖలో కలిపి మొత్తం 16వేల 614 ఖాళీల భర్తీకి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏప్రిల్‌ 25వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలయ్యింది. పోలీసు విభాగంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 20వ తేదీ వరకు గడువు విధించారు. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం నిర్ణయం  తీసుకుంది. తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌ మెంట్‌ బోర్డు (TSLPRB) ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే, కొందరు సైబర్‌ కేటుగాళ్లు దీనికి ఫేక్‌ వెబ్‌సైట్‌ను సృష్టించారు. అభ్యర్థులను బురిడీ కొట్టిస్తున్నారు. దీనిపై అభ్యర్థులకు బోర్డు అధికారులు కూడా కీలక సూచనలు చేశారు.


ఉద్యోగాలకు గ్రూప్స్‌ కోసమైతే.. టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ అయిన https://www.tspsc.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అలాగే, పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://www.tslprb.in/ ను వినియోగించాలి. అయితే, కొందరు సైబర్‌ కేటుగాళ్లు ఈ వెబ్‌సైట్లపై కన్నేశారు. అధికారిక వెబ్‌సైట్లను పోలిన నకిలీ వెబ్‌సైట్లు సృష్టించారు. తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు చెందిన అధికారిక వెబ్‌సైట్‌కు బదులు..  tslprb.co.in పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందించారు.


ఆ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేస్తే అడ్రస్‌బార్‌లో వేరే వెబ్‌సైట్‌కు సంబంధించిన లింక్‌ ఓపెన్‌ అవుతోంది. అయితే, కొందరు అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో, సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేశారు. నకిలీ వెబ్‌సైట్ల మూలాలు కనుగొనే పనిలో పడ్డారు. అలాగే, ఇంకేమైనా నకిలీ వెబ్‌సైట్లు సృష్టించారా? అన్న కోణంలోనూ అన్వేషణ సాగిస్తున్నారు. దరఖాస్తు చేసుకునేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని సలహా ఇస్తున్నారు.


Also Read: Ipl 2022 Love Proposal In Cricket Match: క్రికెట్‌ స్డేడియంలో లవ్‌ ప్రపోజల్‌, ఒకే చెప్పిన అబ్బాయి..!


Also Read: India Covid 19 Cases: మూడు వేలకు పైగా కొత్త కరోనా కేసులు.. భారీగానే మరణాలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.