హైదరాబాద్ వేదికగా సెప్టెంబర్ 9న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో జరిగే  ఈ సమావేశంలో జీఎస్టీ అమలు, శ్లాబ్ రేట్ల విషయంలో సవరణలతో సహా పలు అంశాలపై సుదీర్ఘ చర్చ జరగనుంది. ఈ కౌన్సిల్ వేదికగా జీఎస్టీ లోపాలను సవరించాలని..అనవసర భారాలు తగ్గించాలని కేసీఆర్ సర్కార్ తన వాదనను వినిపించనుంది. ప్రభుత్వ ఆధర్వ్యంలో జరిగే అభివద్ది కార్యకర్యక్రమాలకు సంబంధించిన వర్క్స్ కాంట్రాక్ట్ పై జీఎస్టీని 18 శాతానికి పెంచడాన్ని టి.సర్కార్ వ్యతిరేకిస్తోంది. దీనిపై పలుమార్లు కౌన్సిల్ సమావేశంలో తన వాదన్ను వినిపించింది. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ సమావేశంలో జీఎన్టీపై పూర్తి వివరాలతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలని టి.సర్కార్ భావిస్తోంది. ప్రజలకు ఉపయోగపడే పథకాలు, కార్యక్రమాల కోసం చేపడుతున్న ప్రాజెక్టులు, నిర్మాణపనులపై విధించిన జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గించాలనేది సీఎం కేసీఆర్ ప్రధాన డిమాండ్. దీనిపై టి.సర్కార్ ఎలాంటి ప్రజెంటేషన్ ఇస్తుంది..దీనికి కేంద్రం ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠత నెలకొంది.