Amith Reddy Gutha: నల్గొండ ఎమ్మెల్యే టికెట్.. గుత్తా `వారసుడి` ఎంట్రీకి స్కెచ్!
Gutha Amith Reddy will contest from Nalgonda in TS Assembly Elections 2023. గుత్తా సుంఖేందర్ రెడ్డి తన వారసుడు గుత్తా అమిత్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు చక్రం తిప్పుతున్నారు.
Gutha Amith Reddy will contest from Nalgonda in TS Assembly Elections 2023: తన వారసుడి పొలిటికల్ ఎంట్రీ కోసం ఓ బడా లీడర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గులాబీ పెద్దల ఆశీర్వాదంతో తనయుడిని ఎమ్మెల్యేగా చూడాలని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో... 'సమయం లేదు మిత్రమా' అంటూ సామాజిక కార్యక్రమాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. పొలిటికల్ స్ట్రాటజీలతో యూత్‌కు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇంతకీ ఎవరా యువ లీడర్ అని ఆలోచిస్తున్నారా?. ఆయన మరెవరో కాదు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన శాసనమండలి చైర్మన్ 'గుత్తా సుంఖేందర్ రెడ్డి'.
గుత్తా సుంఖేందర్ రెడ్డి తన వారసుడు గుత్తా అమిత్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు చక్రం తిప్పుతున్నారు. పార్టీ లైన్ దాటకుండా.. తన కుమారుడు కూడా రేసులో ఉన్నాడని హింట్ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గుత్తా అమిత్ రెడ్డిని పోటీలో నిలిపేందుకు పావులు కదుపుతున్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే ట్రస్ట్ ఏర్పాటు చేసి.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తాత గుత్తా వెంకట్ రెడ్డి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల్లో అమిత్ పర్యటిస్తూ.. జనాలను ఆకర్షిస్తున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల జోలికి పోకుండా.. సైలెంటుగా తనపని తాను చేసుకుంటూ నెట్ వర్క్ పెంచుకుంటున్నారు.
విదేశాల్లో చదువుకున్న గుత్తా అమిత్ రెడ్డి వ్యాపారాల్లో దూసుకుపోతున్నారు. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు ఆయన సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ టైం వచ్చిందని గుత్తా అనుచరులు అంటున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో సీటు పక్కా అవుతుందని వారు ఉన్నారు. బీఆర్ఎస్ పెద్దల ఆశీర్వాదంతోనే గుత్తా అమిత్ రెడ్డి రాజకీయ ఆరంగ్రేటం చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. ఈ విషయం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వరకూ వెళ్లింది. ఇద్దరిని పిలిచి మాటాడినట్టు కూడా సమాచారం. సీఎం మందలించినా ఆ ఇద్దరి తీరులో మార్పు కాదు కదా.. తమ వ్యవహార శైలితో ఏకంగా ప్రజాభిమానం చెడగొట్టుకున్నారట. భూపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిల తీరుతో అసంతృప్తిగా ఉన్న బీఆర్‌ఎస్ హైకమాండ్.. గుత్తా అమిత్ రెడ్డిని ఎంకరేజ్ చేస్తున్నట్టు పొలిటికల్ సర్కిళ్లల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి.
రాష్ట్ర ఎన్నికలకు కొద్ది నెలల సమయం ఉన్న నేపథ్యంలో టికెట్ రేసులో తాను పోటీలో ఉన్నానని చెప్పేందుకు పొలిటికల్ స్ట్రాటజీలతో గుత్తా అమిత్ రెడ్డి దూసుకెళ్తున్నారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐప్యాక్ టీం సభ్యులను కూడా రంగంలోకి దించారని సమాచారం. అందుకే సోషల్ మీడియా చురుగ్గా ఉండడంతో పాటు గ్రౌండ్ లోనూ అమిత్ యాక్టివ్ అయ్యారు. హైకమాండ్ ఆదేశిస్తే నల్గొండ లేదా మునుగోడు నుంచి పోటీ చేసేందుకు గుత్తా వారసుడు గ్రౌండ్ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. మొత్తానికి గుత్తా వారసుడు ఎంట్రీతో నల్గొండలో రాజకీయ సమీకరణం మారే అవకాశాలు ఉన్నాయి.
Also Read: IPL 2023 Playoffs Race: ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన గుజరాత్.. మిగతా మూడు జట్లు ఇవేనా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.