Hanuman Jayanti Procession: హనుమాన్ జయంతి సందర్భంగా భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ సంయుక్తంగా శోభాయాత్ర ర్యాలీ చేపట్టనున్నాయి. గౌలిగూడ రాంమందిర్ నుంచి తాడ్‌బండ్లోని వీరాంజనేయ స్వామి ఆలయం వరకు యాత్ర సాగుతుంది. మొత్తం 21 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. ఉదయం 11 గంటల నుంచే శోభాయాత్ర మొదలై రాత్రి 8 గంటలకు ముగుస్తుంది. ఊరేగింపులో వేల సంఖ్యలో కార్యకర్తలు, యువకులు పాల్గొంటారు. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటు పోలీసులు సైతం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర రూట్‌ మ్యాప్‌ను పోలీసులు పరిశీలించారు. నగర సీపీ సీవీ ఆనంద్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక బస్సులో రూట్‌ మ్యాప్‌ పరిశీలించారు. 8 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉండనున్నానరు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, తదితర కీలక ప్రాంతాల్లో యాత్ర కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలను సైతం అమర్చారు. సీసీ కెమెరాలను ఆయా పీఎస్‌ల ద్వారా కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. అదనంగా మరో నాలుగు డ్రోన్‌ కెమెరాలను అధికారులు వాడుతున్నారు.  


శోభాయాత్ర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. గౌలిగౌడ రామ్‌మందిర్ నుంచి ఆంధ్రా బ్యాంక్‌ కోఠి వరకు, కోఠిలోని డీఎంహెచ్‌ కార్యాలయం నుంచి కాచిగూడ క్రాస్‌ రోడ్స్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్, వీఎస్‌టీ, బాగ్‌లింగంపల్లి, ఇందిరాపారర్క్, కవాడీగూడ క్రాస్‌ రోడ్స్‌ వరకు ఆంక్షలు ఉన్నాయి. ఇటు ప్యారడైజ్‌ కూడలి నుంచి బ్రూక్ బాండ్ కాలనీ, బ్రూక్‌ బాండ్ నుంచి తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. 


హనుమాన్ శోభాయాత్రతో  నగరంలో మద్యం అమ్మకాలపై బంద్ విధించారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఆదివారం ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు ఉండవు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.


Also Read: RTC charges: ప్రజలకు మరో షాక్​- పెరిగిన ఆర్టీసీ రిజర్వేషన్ ఛార్జీలు!


Also Read: PBKS vs GT: పంజాబ్‌దే బ్యాటింగ్.. బెయిర్‌స్టో వచ్చేశాడు! తుది జట్లు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe