Harish rao: సీఎం నోటి కంపు మోరీల్ని మించిపోయింది.. మరోసారి పంచ్ లు వేసిన హరీష్ రావు .. వీడియో..
Harish rao fires on Revanth reddy: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు.. సీఎం రేవంత్, కాంగ్రెస్ మంత్రులపై సెటైర్ లు వేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
Harish rao fires on cm revanth reddy: తెలంగాణలో రాజకీయాలో ఒక్కసారిగా హీట్ ను పెంచేశాయి. అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డిల వివాదాలు రాజకీయాల్లో రాజకీయాల్లో రచ్చగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో.. తాజాగా, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ ను సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులపై పంచ్ లు వేశారు. మాజీ మంత్రి హరిష్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రజలు.. రెండు రకాల వరదలతో ప్రజలు తిప్పలు పడుతున్నారు. ఒకటి వర్షాలతో వచ్చిన వరద అయితే, రెండు చిల్లర ముఖ్యమంత్రి అబద్దాల వరద అంటూ సెటైర్ లు వేశారు. అంతేకాకుండా.. వరదలతో వచ్చిన బురదను శుభ్రంచేసుకొవచ్చని.. కానీ ముఖ్యమంత్రి నోటి నుంచి వస్తున్న మురుగు బురదను మాత్రం కడగలేకపోతున్నామన్నారు. సీఎం రేవంత్ మాటలు.. మోరీల కంపును మించి.. ముఖ్యమంత్రి నోటి కంపు ఉందంటూ పంచ్ లు వేశారు. ప్రభుత్వంలో ఉన్నాననే సోయి లేకుండా.. నోటి కొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి మెడలు వంచి రుణమాఫీలు చేయించానన్నారు. ఇంకా సగం కూడా ఆయన మెడలు వంచి మరీ రుణమాఫీ చేయిస్తానని కూడా వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా.. సీఎం రేవంత్ వ్యక్తి మాట్లాడే భాష .. ఇలానే ఉంటుందా అని ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఏ ముఖ్యమంత్రి ఇంత నోరు తెర్చి చెత్త మాటలు మాట్లాడలేదన్నారు. నీ బుద్ధి కురుచ. నీ చరిత్ర కురుచ.. నీ భాష కురుచ.. అంటూ మండిపడ్డారు. నీ కురుచ తనం వల్ల నీకు కల్గిన ఆత్మనూన్యత వల్ల పదే పదే నా పొడుగు గురించి మాట్లాడుతావంటూ రేవంత్ ను ఏకీ పారేశారు. తనను తాటిచెట్టంట అని రేవంత్ అంటాడని, నువ్వు వెంపలి చెట్టంత కూడా ఎదుగలే.
లిల్లీపుట్ అని నేను ఆనలేనా..సన్నాసి అని నేను అనలేనా.. అంటూ చురకలు అంటించారు. నా ఎత్తు గురించి ఆలోచించడం మానేసి రైతుల గురించి ఆలోచించని ఫైర్ అయ్యారు. రుణమాఫీ పూర్తి చేశా అని.. దేవుళ్ళ మీద ఓట్లు పెట్టీ మరీ. అబద్ధాలు చెప్పినవ్ అంటూ మండిపడ్డారు. రుణామాపీ జరగలేదని నిరూపిస్తానంటూ సవాల్ విసిరారు. వెంకటాపురం గ్రామంలో 122 మందికి అయితే అయితే 82 మందికి కాలేదన్నారు.
అంతేకాకుండా.. కోటి 13 లక్షల 74 అయితే, కోటి 5 లక్షల మాఫీ జరగలేదన్నారు. పింఛన్ 4000 అని , మహిళలకు 2500 రూపాయలని చెప్పి, ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ప్రజల్ని మోసంచేశావని ఎద్దేవా చేశారు. 100 సార్లు సన్నాసి అంటా.. కానీ నాకు విలువలున్నాయి. నీలాగా నోరు పారేసుకోలేనని అన్నారు.
Read more: CM Revanth Reddy: సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాం.. సంచలన ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
సీఎం రేవంత్ రెడ్డి.. రెండు లక్షలు కంటే ఎక్కువ డబ్బులున్న వాళ్లు బ్యాంకుల్లో కట్టేయలని, వెంటనే రుణమాపీ చేస్తారని ప్రకటించారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.. రెండు లక్షలు తాము చెప్పినప్పుడు మాత్రమే కట్టాలని చెప్తారు.. ఇల్లా మీలో మీకే క్లారిటీలేదని కూడా సెటైర్ లు వేశారు. రేవంత్ నీ గుండెల్లో నిద్రపోతా, గుండెల్లో దాక్కున్న అంటూ సీఎం రేవంత్, కాంగ్రెస్ మంత్రులపై మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.