Bandaru dattatreya escaped from road accident in shamshabad: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్తుంది. అప్పుడు.. ఒక వ్యక్తి సడెన్ గా కాన్వాయ్ మధ్యలోకి రావడం వల్ల.. మూడు కార్లు ఒక్కసారిగా ఢీకొన్నాయి. బండారు దత్తాత్రేయ కారుకు సెక్యురిటీగా ఉన్న మూడు కార్లు వరుసగా ఢీకొనడంతో ఒక్కసారిగా అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెంటనే సెక్యురిటీ సిబ్బంది అప్రమత్తమై అక్కడి నుంచి బండారు దత్తాత్రేయ కారును సెఫ్టీగా ముందుకు వెళ్లేలా ట్రాఫిక్ ను క్లియర్ చేసినట్లు తెలుస్తొంది. మరోవైపు బండారు దత్తాత్రేయ గతంలోను ఒకసారి రోడ్డు ప్రమాదం నుంచి బైటపడినట్లు తెలుస్తొంది. అయితే.. ఇప్పుడు మాత్రం.. బండారు దత్తాత్రేయకు చెందిన మూడు కార్లు పూర్తిగా  ధ్వంసమైనట్లు సమాచారం. ఈ ఘటనతో బీజేపీ శ్రేణులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. బండారు దత్తాత్రేయ ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తొంది. 


 మరోవైపు ఈసారి కూడా.. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దసరా సమ్మేళనం-2024 వేడుకగా జరిగింది. అలయ్‌ బలయ్‌ అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటైన కార్యక్రమాన్ని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ప్రారంభించిన విషయం తెలిసిందే.


Read more: Group 1 Aspirants Protest: ఇదేక్కడి ఘోరం.. అమ్మాయి బ్లౌజ్ చింపి కొట్టిన సీఐ.. కేంద్ర మంత్రి సీరియస్..


దీనిలో.. సంప్రదాయ నృత్యాలు, కోలాటం, గిరిజన నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు, పులి వేషాలు అలయ్‌ బలయ్‌లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టేవిధంగా నిర్వహించారు. రాజకీయాలు అతీతంగా మన ఐక్యమత్యం, ఆచారాలు, సంప్రదాయలు ఉట్టిపడేలా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్కక్రమానికి పార్టీలకు అతీతంగా ముఖ్యనేతలు హజరయ్యారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి