Mahalakshmi LPG Gas Cylinder:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేసింది. తమను గెలిపిస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల నేపథ్యంలో ప్రకటించారు. అదేవిధంగా ఒక్కో గ్యారెంటీలను అమలు చేయడానికి కృషి చేస్తుంది కూడా. ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచింది. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఇటీవలె అభయహస్తంలో భాగంగా దరఖాస్తు పారమ్ తీసుకున్నారు. ప్రస్తుతం ఇది ప్రాసెసింగ్ దశలో ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదీ చదవండి: Mahalakshmi Scheme: మహిళల ఖాతాల్లో ఆరోజే రూ.2,500 జమా.. మహాలక్ష్మి పథకంపై రేవంత్ సర్కార్ కీలక అప్డేట్..!


మహాలక్ష్మిపథకంలో భాగంగా రూ.500 కే సిలిండర్ పై తాజా అప్టేట్ వచ్చింది. ఈ పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకున్నవారిని  ఆశా కార్యకర్తలు అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేస్తారు. ఈ కార్యకర్తలు డోర్ టూ డోర్ వెళ్లి రేషన్ కార్డు ఇతర ధృవపత్రాలను పరిశీలించనున్నారు. అర్హులైనవారి పూర్తి వివరాలను నమోదు చేసుకుంటారు. 


ఇదీ చదవండి: Free Electricity: రేషన్ కార్డు ఉన్నవారికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్: సీఎం రేవంత్ రెడ్డి


ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నఅర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. మరో రెండు గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టారు. ఇందులో ప్రభుత్వం ప్రకటించిన అయిదు గ్యారంటీలకు అర్హులైన వారందరి నుంచి గ్రామసభలు, వార్డు సభల ద్వారా  దరఖాస్తులను స్వీకరించారు. 5 గ్యారంటీలకు మొత్తం  1,09,01,255 దరఖాస్తులు నమోదయ్యాయి. జనవరి 12వ తేదీ నాటికే వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు అధికారులు సీఎంకు నివేదించారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook