Rains Alert:  తెలంగాణ(Telangana)లో రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన (Rain Alert for telangana) తేలికపాటి నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనాని(Low pressure)కి అనుబంధంగా ఉన్న (Rain Alert for telangana) ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కి.మీ ఎత్తులో స్థిరంగా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ అల్ప పీడనం పశ్చిమ దిశగా ప్రయాణించి.. పశ్చిమ మధ్య , దానిని ఆను కొని ఉన్న నైరుతి బంగాళా ఖాతం(Bay of Bengal) వద్ద నున్న  దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ -ఉత్తర తమిళనాడు తీరాన్నీ రేపు ఉదయం తాకనుందని చెప్పారు. మరొక అల్పపీడన ద్రోణి అరేబియా సముద్రం దాని పరిసర ప్రాంతమైన గోవా, దక్షిణ మహారాష్ట్ర తీరం నుంచి దక్షిణ తమిళనాడు వరకు గల అల్పపీడనం, దానికి అనుబంధంగా గల ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4 .5 కిలోమీటర్లు వరకు విస్తరించి ఉందన్నారు.


Also read: Telangana Weather Report: తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు!


ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఈ అల్పపీడనం వల్ల ఏపీ(Andhra Pradesh)లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook