Heavy Rain in Hyderabad: హైదరాబాద్‌లో నిన్న రాత్రి (బుధవారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. దీనికి కారణంగా రాజధానిలోని పలు లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో బుధవారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు భారీ వర్షం కురువగా.. రహదారులపై వరద నీరు భారీగా రావడంతో ట్రాఫిక్ లో అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా రెండు నుంచి మూడు గంటల వరకు వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. అయితే వర్షాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారీ వర్షాలు ఇక్కడే:
ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలు విషయానికొస్తే.. నగరంలోని షాద్నగర్, మణికొండ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, బేగంపేట్, యూసుఫ్ గూడా, ఖైరతాబాద్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, షేక్పేట్, రాజేంద్రనగర్, బండ్లగూడ, నార్సింగి, గోల్కొండ పుష్పలగూడ లో భారీ వర్షాలు కొనసాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లోని పలు కాలనీలో భారీగా వరద నీరు చేరింది.


పెరిగిన వరద ఉధృతి:
భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం రిజర్వాయర్లకు చేరుకుంటోంది. బుధవారం కురిసిన భారీ వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు వచ్చే వరద స్థాయి ఒక్కసారిగా పెరిగింది. ఉస్మాన్ సాగర్ కు భారీ వరద చేరుకోవడంతో అధికారులు నాలుగు గేట్లను ఎత్తివేశారు. ఉస్మాన్ సాగర్ ఇన్ఫ్లో 900 క్యూసెక్కులు కాగా హౌస్ లో 952 క్యూసెక్కులుగా ఉంది. ఇక హిమాయత్ సాగర్ కూడా భారీ వరద ప్రవాహం చేరుకుంటుంది. దీంతో అధికారులు జలాశయం యొక్క 2 గేట్లనే ఎత్తి నీటిని బయటికి వదులుతున్నారు.


 ప్రస్తుత నీటి సామర్థ్యం 2. 846 టీఎంసీలు  కాగా జలాశయం ఇన్ఫ్లో 1200 క్యూసెక్కులు గా అవుట్ ఫ్లో 1373 గా నమోదయింది. నగరంలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో ప్రాజెక్టులలోకి వరద ఉధృతి పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు తెలుపుతున్నారు.


Also Read : Adipurush case : ఆదిపురుష్‌కు దెబ్బ మీద దెబ్బ


Also Read : Galata Geetu : భయంకరమైన అతి.. గీతూ ఓవర్ యాక్షన్


 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook