Telangana Rains Alert:హైదరాబాద్ ను ముంచేసిన వరద.. కుండపోతతో తెలంగాణ అతలాకుతలం! 18 జిల్లాలకు ఇవాళ రెయిన్ అలెర్ట్
Telangana Rains Alert: తెలంగాణపై మళ్లీ పంజా విసిరాడు. గత వారంలో నాన్ స్టాప్ గా కుమ్మేసిన వరుణుడు... నాలుగు రోజులు శాంతించాడు. మళ్లీ తెలంగాణపై ప్రచాపం చూపిస్తున్నాడు. శుక్రవారం తెలంగాణ వ్యాఫ్తంగా వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో కుంభవృష్ఠి కురిసింది
Telangana Rains Alert: తెలంగాణపై మళ్లీ పంజా విసిరాడు. గత వారంలో నాన్ స్టాప్ గా కుమ్మేసిన వరుణుడు... నాలుగు రోజులు శాంతించాడు. మళ్లీ తెలంగాణపై ప్రచాపం చూపిస్తున్నాడు. శుక్రవారం తెలంగాణ వ్యాఫ్తంగా వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో కుంభవృష్ఠి కురిసింది. కొన్ని గంటల్లనే 200 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. దీంతో వరద పోటేత్తింది.
శుక్రవార ఉదయం 8-30 గంటల నుంచి శనివారం ఉదయం ఏడు గంటల వరకు మెదక్ జిల్లా పాతూరులో అత్యధికంగా 268 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. జనగామ జిల్లా దేవరుప్పలలో 255, మెదక్ జిల్లా రాజుపల్లిలో 238, మదబూబాబాద్ లో 222, సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 215, మెదక్ జిల్లా శివంపేటలో 214, మెదక్ లో 213, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కర్కగూడెంలో 200 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. ఏడు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షం కురవగా.. 84 ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది. 195 ప్రాంతాల్లో భారీ వర్షం, 411 ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. శుక్రవారం తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. [[{"fid":"238829","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు మహబూబా బాద్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లో అక్కడక్కడ కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని, ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించింది.
Also read:CBSE 10th Results: సీబీఎస్‌ఈ పది ఫలితాలు విడుదల..రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..!
Also read:Rain Alert: తెలంగాణలో రెయిన్ అలర్ట్..ఐదురోజులపాటు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook