Telangana Rains Alert:తెలంగాణపై శాంతించని వరుణుడు.. భారీ వర్షాలతో రైతులు ఆగమాగం
Telangana Rains Alert: తెలంగాణను వరుణుడు విడిచిపెట్టేలా కనిపించడం లేదు. భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రెండు మూడు రోజులుగా వాతావరణం విచిత్రంగా మారుతోంది. మధ్యాహ్నం సమయంలో విపరీతమైన ఎండ కాస్తోంది. సాయంత్రానికి దట్టుమైన మబ్బులు కమ్ముకుని వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది.
Telangana Rains Alert: తెలంగాణను వరుణుడు విడిచిపెట్టేలా కనిపించడం లేదు. భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రెండు మూడు రోజులుగా వాతావరణం విచిత్రంగా మారుతోంది. మధ్యాహ్నం సమయంలో విపరీతమైన ఎండ కాస్తోంది. సాయంత్రానికి దట్టుమైన మబ్బులు కమ్ముకుని వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. శనివారం కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు జగిత్యాల జిల్లా కోవైలో అత్యధికంగా 82 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిగడ్డలో 75, నిర్మల్ జిల్లా బుట్టాపూర్ లో 68 మిల్లిమీటర్ల వర్షం కురుస్తోంది. నిర్మల్ జిల్లా దస్తులాబాద్ లో 60, అసిఫాబాద్ జిల్లా కరిమెరిలో 54, సిరిసిల్ల జిల్లా మల్లారంలో 52, రంగారెడ్డి జిల్లా కందుకూరులో 50 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. శనివారం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షం, 71 ప్రాంతాల్లో భారీ వర్షం, 106 ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
గ్రేటర్ పరిధిలోని శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రామచంద్రపురంలో 44 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. కూకట్ పల్లి మూసాపేటలో 43, శేరిలింగంపల్లిలో 34, చందానగర్ లో 34, కేపీహెబీలో 30, గచ్చిబౌలిలో 29, లింగంపల్లిలో 29 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. సాయంత్రం వర్షం కురవడంతో కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద నీరు రోడ్లపైకి చేరింది. లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. వరద నీటితో నగరంలోని ప్రధాన కూడళ్లు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
[[{"fid":"239804","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
Also read:DK Aruna: కుటుంబ విభేదాలతోనే షర్మిల పార్టీ పెట్టారు..డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook