Heavy Rains in Telangana: తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, వరంగల్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌ తదితర జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. వర్ష బీభత్సానికి ఎక్కడికక్కడ చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటికే సిరిసిల్ల పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పట్టణంలో ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. కరీంనగర్‌ నగరంలో ప్రధాన రహదారిపైకి వరద నీరు వచ్చి చేరుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కామారెడ్డిలో...
కామారెడ్డి జిల్లా(Kamareddy District)లోని పిట్లం-బాన్సువాడ మధ్యలో రాంపూర్‌ వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయమేర్పడుతోంది. మద్నూర్‌ మండలం గోజెగావ్‌లోని లెండి వాగుకు భారీగా వరదనీరు పోటెత్తుతోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. డోంగ్లి- మాధన్ హిప్పర్గ మార్గంలో నిర్మాణంలో ఉన్న వంతెన వద్దకు వరదనీరు చేరుకోవడంతో రాకపోకలకు ఆగిపోయాయి. బిచ్కుంద మండలం ఖత్‌గావ్‌-కుర్లా మార్గంలో వరద ప్రవాహానికి రోడ్లు కోతకు గురయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 


జగిత్యాల జిల్లాలో..
జగిత్యాల జిల్లా(Jagittala District)లోనూ నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లో లెవెల్‌ బ్రిడ్జిల పైనుంచి వరద నీరు(Flood Water) ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పలుచోట్ల రోడ్డు దెబ్బతినడంతో జగిత్యాల-ధర్మారం, జగిత్యాల-ధర్మపురం, జగిత్యాల-పెగడపల్లి, రాయికల్‌-కోరుట్ల, వేములవాడ-కోరుట్ల మార్గాలను అధికారులు మూసివేశారు. ఆ మార్గాల్లో వెళ్లేందుకు ప్రయత్నించవద్దని ప్రజలకు సూచించారు.


వరంగల్ జిల్లాలో...
వరంగల్ జిల్లా(Warangal District)లో కురుస్తున్న భారీ వర్షాల(Heavy Rains)కు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు కుంటలు అలుగులు పారుతూ రోడ్లపైకి చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్ధన్నపేటలోని ఆకేరు వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి(National HighWay)పై వరదనీరు భారీగా ప్రవహిస్తుండటంతో పంతిని వద్ద నీటి ప్రవాహంలో ఓ లారీ చిక్కుకుంది. ఉప్పరపల్లి చెరువు ఉప్పొంగడంతో అటుగా వెళ్లే రోడ్డు పూర్తిగా వరదముంపులో ఉండిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లోని పంటపోలాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నీటమునిగాయి. 


మరోవైపు హుస్నాబాద్‌(Husnabad)లో కురిసిన వర్షానికి ప్రధాన రహదారిపై వరదనీరు చేరింది. అంబేడ్కర్‌ చౌరస్తా, నాగారం రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్‌తో పాటు పలు వీధులు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షం ప్రభావంతో జమ్మికుంట నుంచి కోరపల్లికి వెళ్లేదారిలో విద్యుత్‌ స్తంభాలు(Electricity poles) విరిగిపడ్డాయి. ఆ ప్రాంతంలో పలుచోట్ల వరదనీరు పంటపొలాల్లోకి(Crops) చేరడంతో పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook