Heavy rains in Telangana: హైదరాబాద్: అల్పపీడణ ద్రోణి ప్రభావంతో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలావుండగా మరో 48 గంటలు పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Telangana rains) కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో మంచిర్యాల జిల్లా హాజీపూర్ ప్రాంతంలో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షం కురవగా... నిర్మల్ జిల్లా మమ్డాలో 15.3, కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో 12.8, నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందాలో 12.7, జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో 12.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Telangana Minister KTR: ఈటల రాజేందర్ తన తప్పును ఒప్పుకున్నారు, మంత్రి కేటీఆర్ కామెంట్స్


ఇదిలావుంటే, మరోవైపు ఇటీవల రాష్ట్రంలో పలుచోట్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలలతో (Heavy rain) పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ప్రాజెక్టుల్లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం, జూరాల, నాగార్జున సాగర్ (Nagarjuna Sagar project), శ్రీరాం సాగర్ ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టుల్లోకి ఇన్ ఫ్లో పెరుగుతోంది.


Also read : Etela Rajender Delhi Tour: బీజేపీ నేతగా తొలిసారి అమిత్ షాతో ఈటల రాజేందర్ భేటీ!