Heavy Rains Effect on Vegetable Prices: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇళ్ల నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆఫీసులకు, కూలీ పనులకు వెళ్లేవారు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులకు తోడు కూరగాయల ధరలు సామాన్యులను మరింత ఇబ్బందిపెడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ హోల్ సేల్ మార్కెట్‌కు వచ్చే దిగుమతులు తగ్గిపోయాయి. సప్లై తగ్గిపోవడంతో కూరగాయల ధర భారీగా పెరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణ రోజుల్లో కిలో టమాటా రూ.20 ఉండగా, ప్రస్తుతం కిలో టమాటా ధర రూ.40కి చేరింది. బెండకాయ, గోరుచిక్కుడు, చిక్కుడు కిలో ధర రూ.40 నుంచి రూ.60కి, కాకరకాయ ధర రూ.30 నుంచి రూ.50కి, క్యాప్సికం ధర రూ.30 నుంచి రూ.40కి, క్యాబేజీ ధర రూ.20 నుంచి రూ.40కి, బీన్స్ ధర రూ.50 నుంచి రూ.70కి పెరిగింది. కిలో దొండకాయ రూ.30 నుంచి రూ.60కి, కిలో వంకాయ ధర రూ.30 నుంచి రూ.50కి పెరిగింది. పచ్చి మిర్చి ధర ఏకంగా రూ.60 నుంచి రూ.80కి పెరిగింది.


రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్ మార్కెట్లకు వచ్చే దిగుమతులు తగ్గిపోయాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా తోటల్లో కూరగాయలు కోయడం రైతులకు కష్టంగా మారింది. దానికి తోడు రవాణా కష్టాలు కూడా ఉండటంతో మార్కెట్లకు సప్లై తగ్గింది. ప్రస్తుతం బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్ మార్కెట్లకు కేవలం 30 నుంచి 50 శాతం సప్లై మాత్రమే జరుగుతోంది. 


సాధారణ రోజుల్లో బోయిన్‌పల్లి మార్కెట్‌కు దాదాపు 32 వేల క్వింటాళ్ల కూరగాయలు దిగుమతి అవుతాయి. కానీ ప్రస్తుతం 12 వేల క్వింటాళ్లకు మించట్లేదని తెలుస్తోంది. గుడిమల్కాపూర్ మార్కెట్‌కు సాధారణ రోజుల్లో 10 వేల క్వింటాళ్ల వరక దిగుమతి అవుతాయి. కానీ ఇప్పుడది 4 వేల క్వింటాళ్లకు పడిపోయింది. దీంతో ఆ ప్రభావం కూరగాయల ధరలపై పడింది. పెరిగిన ధరలు సామాన్యులకు ఇబ్బందిగా మారాయి.


Also Read: Telangana Rain Alert: తెలంగాణలో 100 శాతం అధిక వర్షం.. కుండపోత వానలతో అతలాకుతలం! మరో రెండు రోజులు అలెర్ట్  


Also Read:SI Physical Abuse: మరో ఖాకీ కీచకపర్వం.. ఆసిఫాబాద్ జిల్లాలో యువతికి ఎస్సై లైంగిక వేధింపులు..   



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook