Telangana Rains: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈజిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు ఇచ్చారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, సిద్దిపేట, జనగామ, రంగారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట, వనపర్తి, జోగులాంట గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి. పై జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. రేపు(శుక్రవారం) రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఎల్లుండి(శనివారం) రంగారెడ్డి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి.


నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ ..వెదర్ రిపోర్ట్‌ను ప్రకటించింది. మరోవైపు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. నిన్న ఆంధ్రప్రదేశ్‌ తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం ఇవాళ అదే ప్రాంతంలో సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది.


ఇటు తూర్పు పడమర ద్రోణి..ఉత్తర అండమాన్ సముద్రం నుంచి ఏపీ తీరం వరకు కేంద్రీకృతమైంది. ఇవాళ తూర్పు పడమర ద్రోణి.. తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి రాయలసీమ వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. అక్టోబర్ 1 నాటికి ఈశాన్య, పరిసర తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా జోరు వర్షాలు కురుస్తున్నాయి. 



Also read:Ys Sharmila: వైఎస్‌ఆర్ ఉంటే కాంగ్రెస్‌పై ఉమ్మి వేసేవారు..షర్మిల సంచలన వ్యాఖ్యలు..!


Also read:IND vs SA: టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ సూపర్ షో..తాజాగా రెండు రికార్డులు బ్రేక్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి