Heavy Rains: గోడ కూలి తల్లి, కూతురు మృతి.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్ష బీభత్సం
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వాన బీభత్సం స్పష్టించింది. భారీ వర్షానికి నల్గొండ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది.
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వాన బీభత్సం స్పష్టించింది. భారీ వర్షానికి నల్గొండ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. పద్మానగర్ కాలనీలో గోడకూలి తల్లీ, కూతుళ్ళు చనిపోయారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి గోడ కూలడంతో నడికుడి లక్ష్మీ (42), కూతురు కళ్యాణి (21) దుర్మరణం చెందారు. పానగల్ బైపాస్ వద్ద భారీగా చేరిన వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద భారీగా పోటెత్తడంతో పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణ తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తెలంగాణలోని 11 పాంత్రాల్లో అతి భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలోని 58 ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తం వర్షం కురిసినట్లు తెలుస్తోంది.గత 24 గంటల్లో సుర్యాపేట, నల్గొండ జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ లో అత్యధికంగా 199 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా ఖానాపూర్‌లో 162 మిల్లీమీటర్లు, ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో 154 మిల్లీ మిటర్లు వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో 140 మిల్లీ మీటర్లు, ఖమ్మం జిల్లా వైరాలో 111 మిల్లీ మీటర్లు వర్షం కురిసింది.
ఇవాళ కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబా బాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ , వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం, గడ్డెన్న సహా పలు ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద భారీగా వస్తోంది. భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. సూర్యాపేటలో ప్రైవేట్ విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. నల్గొండ జిల్లా చండూరులోనూ ప్రైవేట్ విద్యా సంస్థలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది.
Also Read: Boris Johnson: అక్కడ డొనాల్ట్ ట్రంప్.. ఇక్కడ బోరిస్ జాన్సన్! పిచ్చి పనులే కొంప ముంచాయా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook