హైదరాబాద్: మేడారం జాతరకు హాజరు కావాలనే భక్తులకు బేగంపేట నుండి విమాన సేవలను ఉపయోగించుకోవచ్చని, జీఎస్టీతో సహా ఒక లక్ష ఎనభై వేల రూపాయలు చెల్లించి తిరిగి రావచ్చని పర్యాటక శాఖ తెలిపింది. ఈ యాత్రలో ఆరుగురు భక్తులు మేడారం సందర్శించి రావచ్చని తెలిపింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరంగల్ జిల్లా కేంద్రం నుండి 110 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, దేశంలోనే వనదేవతులుగా పూజలందుకుంటున్న సమ్మక్క-సారక్క.


"దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర"గా ఖ్యాతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిషా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. 1996 లో ఈ జాతరను ఆంధ్ర ప్రదేశ్,ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది .
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..