తెలుగు సినిమా పరిశ్రమలోని యంగ్ హీరోగా వెలుగొందుతున్న  హీరో నితిన్...మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు.ప్రజలకు కష్టం వచ్చినప్పుడు .. నేనున్నానంటూ ముందుకొచ్చాడు. గతంలోనూ వరదలు, తుఫాన్ల వంటి ప్రకృతి ముప్పు ఏర్పడినప్పుడు  తన వంతు బాధ్యతను నిర్వర్తించాడు. ఇప్పుడు కూడా  అదే పంథాను కొనసాగించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల్లో 'కరోనా వైరస్'  క్రమక్రమంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు  పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో గుబులు కనిపిస్తోంది. జనం భయాందోళనకు గురవుతున్నారు.  మరోవైపు  కరోనా కోరలు వంచేందుకు తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భారీగా నిధులు కేటాయించాయి. ఐతే  ఈ నిధులు  చాలని పరిస్థితి నెలకొంది. 


మా ఊరికి రావద్దు..!! 


ఈ క్రమంలో అందరికంటే ముందుగా ''నేనున్నానని'' హీరో నితిన్ ముందుకొచ్చాడు. 'కరోనా వైరస్'ను ఎదుర్కునేందుకు తనవంతు సాయానికి  'సై' అన్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి 10 లక్షల  రూపాయల చొప్పున విరాళాన్ని అందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో  భాగంగా 10  లక్షల  రూపాయల  చెక్కును తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అందించాడు. అంతే కాదు కరోనా వైరస్‌ను ఎదుర్కునేందుకు ప్రభుత్వానికి, ప్రజలకు  అండగా నిలవాలని ప్రముఖులకు సూచించాడు.


[[{"fid":"183535","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


కేసీఆర్‌కు సంజయ్ లేఖ 


మరోవైపు హీరో  నితిన్‌ను కేసీఆర్ అభినందించారు. చిన్న వయసులోనే పది మందికి ఆదర్శంగా నిలుస్తున్న నితిన్‌ను ఆయన కొనియాడారు. మరికొద్దిరోజుల్లోనే పెళ్లి చేసుకోబోతున్న హీరో నితిన్ ఔదార్యాన్ని అంతా ప్రశంసిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..