నిజామాబాద్‌ జిల్లాలో హై అలర్ట్  విధించారు. జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఈ కారణంగా జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ విధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజామాబాద్ పట్టణంలోని ఖిల్లా  రోడ్డుకు చెందిన ముజీబ్ ఖాన్ అనే వ్యక్తి కొద్ది రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతున్నాడు. ఆయన్ను పరీక్షించగా కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. నిజామాబాద్ జిల్లాలో ఇదే తొలి కరోనా పాజిటివ్ కేసు కావడం విశేషం.  దీంతో జిల్లావ్యాప్తంగా హై అలర్ట్ విధించారు. 


ముజీబ్ ఖాన్ వయసు 60 ఏళ్లు. ఆయన ఇటీవలే ఢిల్లీలో ఓ మత సదస్సుకు హాజరై నిజామాబాద్ కు తిరిగి వచ్చారు.  ఈ నెల 15న దగ్గు, జలుబు లక్షణాలతో ఆస్పత్రిలో  చేరారు. 13 రోజుల  తర్వాత కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యులను మక్లూర్ లోని నర్సింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కు పంపించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..