TS High Court: ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయిగణేష్ మృతి అంశం కీలక మలుపు తిరిగింది. సాయిగణేష్ ఆత్మహత్యపై విచారణ జరిపిన హైకోర్టు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు నోటీసులు జారీచేసింది. పోలీసుల వేధింపులు భరించలేకే సాయిగణేష్ ఆత్మహత్య చేసుకున్నాడని పిటిషనర్ తరపు న్యాయవాది అభినవ్ వాదనలు వినిపించారు. ఈ విషయంపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. అటు ఈ ఆత్మహత్యపై కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామన్నారు. కొంత సమయం ఇస్తే పూర్తివివరాలతో కౌంటర్ జారీచేస్తామన్నారు ఏజీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు మొత్తం ఏడుగురు ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. ఇందులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఉన్నారు. తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదావేసింది. ఇప్పటికే సాయిగణేష్ ఆత్మహత్య విషయంపై బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆరోపిస్తోంది. పోలీసులతో తమ కార్యకర్తలను వేధిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇదే అంశంపై గవర్నర్ తమిళసైకి కూడా కంప్లైంట్ చేశారు ఆ పార్టీ నాయకులు. గవర్నర్ సైతం అధికారుల నుంచి నివేదిక కోరారు.


మరోవైపు సాయిగణేష్‌ ఆత్మహత్య అంశంపై తొలిసారి స్పందించారు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్. కమ్మ సామాజిక వర్గంవాడినైనందుకే తనను టార్గెట్ చేశారన్నారు. తెలుగురాష్ట్రాల్లో కమ్మ సామాజిక వర్గం నేతలపై దాడులు, కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఏపీలో ఇప్పటికే ఒక్క కమ్మ సామాజిక వర్గ మంత్రి కూడా లేడని.. తెలంగాణలో కూడా ఆ వర్గం ప్రాతినిధ్యం లేకుండా చేయడానికి ట్రై చేస్తున్నారన్నారు. ఖమ్మంలో జరిగింది చిన్న ఘటన అన్న పువ్వాడ.. దాన్ని ఆధారం చేసుకొని లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ఫైరయ్యారు. ఇలాంటి సమయాల్లోనే కమ్మ సామాజిక వర్గంవాళ్లు ఐక్యంగా ఉండాలన్నారు. అయితే తెలంగాణలో మాత్రం కమ్మవారికి రాజకీయంగా మంచి అవకాశాలే దక్కుతున్నాయన్నారు పువ్వాడ. సీఎం కేసీఆర్ కమ్మ సామాజికవర్గాన్ని ఆదరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.


Also Read: MS Dhoni-Jadeja: ఎంఎస్ ధోనీ ముందు మోకరిల్లిన చెన్నై కెప్టెన్.. క్యాప్ తీసి సలాం కొట్టాడుగా! మహీనా మజాకా


Also Read: F3 Movie Songs: 'ఎఫ్‌ 3' నుంచి 'ఊ ఆ ఆహా ఆహా' లిరికల్ సాంగ్ వచ్చేసింది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.