హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ), 14.5 కిలోమీటర్ల నెక్లెస్ రోడ్ పరిధి చుట్టూ ప్రక్కల 240 హై-రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, నిరంతరం అప్రమత్తం కొరకు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రధానంగా ద్విచక్ర వాహనదారులపై నిఘా ఉంచడం, తరచూ పరిశీలనలు, అశ్లీల కార్యకలాపాలకు పాల్పడేవారిపై నిఘా ఉంచడం వంటి చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. సీసీటీవీ కెమెరాలు సంజీవయ్య పార్క్, పార్కు సమీపంలో ఉన్న ఎత్తైన త్రివర్ణ పథకం వద్ద, తినుబండారాల సముదాయం, టైపోగ్రాఫికల్ స్ట్రక్చర్ ‘లవ్ హైడ్’ పీపుల్స్ ప్లాజా చుట్టూ ఉండే ప్రదేశాలను కవర్ చేస్తుందని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పీపుల్స్ ప్లాజాలో జరిగే అశ్లీల కార్యకలాపాలపై, ఇతర సంఘటనలపై నిఘా ఉంచడానికి పోలీసులకు నిఘా నెట్‌వర్క్ సహాయం చేస్తుందని,  అంతేకాకుండా, రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే అంశాలపై కూడా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయవచ్చని తెలిపారు. పోలీసుల అభ్యర్థనను అనుసరించి, నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలపై హెచ్‌ఎండిఎ ప్రత్యేక సర్వే నిర్వహించిందని, "పోల్-మౌంటెడ్ కెమెరాలను ఏర్పాటు చేసే ముందు రెండుసార్లు ప్రాంతాలను పరిశీలించామని, నెక్లెస్ రోడ్డులో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని హెచ్ఎండీఏ అధికారి తెలిపారు.


సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి రూ .3.40 కోట్లు ఖర్చయిందని, అన్నీ వాతావరణ పరిస్థితులను తట్టుకుంటాయని అధికారులు తెలిపారు. సీసీటీవీ నిఘా కెమెరాల నెట్‌వర్క్, హెచ్‌ఎండిఎ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మానిటర్‌లకు అనుసంధానించబడి ఉందని, ఫుటేజీలను నిరంతరం పర్యవేక్షించడానికి మానిటర్లను ఏర్పాటు చేశామని అన్నారు. అంతేకాకుండా, నెక్లెస్ రోడ్, లోయర్ ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్స్ రోడ్ గాంధీనగర్, రామ్‌గోపాల్‌పేట్, సైఫాబాద్ లేక్ పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వస్తాయని పేర్కొనారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..