Telangana news: అదొక రేకుల షెడ్డు.. దానిని చూడగానే పెచ్చులూడి పోయిన పాతగోడలు మనకు దర్శనమిస్తాయి. గట్టిగా గాలి వేసిందంటే కూలిపోయేటట్టు ఉంటుంది. ఇందులో ఒకరు నివశిస్తున్నారు. ఇంట్లో ప్యాన్, టీవి, రెండు బల్బులు మాత్రమే ఉన్నాయి. కానీ కరెంట్ బిల్లు (Electricity Bill) మాత్రం కోట్లలో వచ్చింది. అది అక్షరాలా రూ. 21 కోట్లు. దీంతో ఆయనకు కరెంట్ షాక్ కొట్టినంత పనైంది. మహా అయితే రేకుల షెడ్డుకు వందల్లోనూ లేదా వేలల్లోనూ కరెంట్ బిల్లు రావడం మనం చూసుంటాం. కానీ కోట్లలో రావడంతో ఇప్పుడు ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే..
నిర్మల్ జిల్లా (Nirmal District ) సారంగాపూర్‌కు చెందిన వడ్ల అవుజయ్య ఇంటికి బుధవారం కరెంట్ రీడింగ్ తీయడానికి ఓ వ్యక్తి వచ్చాడు. అతడు రీడింగ్ తీసి ఆవుజయ్యకు బిల్లు ఇచ్చి వెళ్లిపోయాడు. ప్రతి నెల లాగానే ఏ వందల్లోనూ బిల్లు వచ్చి ఉంటుందని అనుకున్నాడు అవుజయ్య. కానీ బిల్లు చూసి షాక్ అయ్యాడు. కరెంటు బిల్లు మొత్తం రూ.21,47,48,364 వచ్చింది. అది చూసి అతడికి ఏమీ అర్థం కాలేదు. కొద్దిసేపటికి తేరుకున్న అతను వెంటనే అధికారులకు చెప్పాడు. ఆ బిల్లు చూసి వారు కూడా అవాక్కయ్యారు. స్కానింగ్ మెషీన్ లోని సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగిందని వారు నిర్ధారించారు. మళ్లీ స్కానింగ్ తీయగా ఎప్పటిలానే వచ్చింది. దీంతో అతడు ఊపిరి పీల్చుకున్నాడు. 


Also Read: Gunfire in siddipeta: సిద్దిపేట జిల్లాలో మరోసారి కాల్పుల కలకలం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook