హైదరాబాద్: జంటనగరాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైదరాబాద్ మెట్రో ప్రారంభోత్సవంపై నీలినీడకల కమ్మకున్నాయి. ఈ నెల 28న ప్రాంభించాలని భావిస్తున్న మోట్రోకు ఇంకా కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ (సీఎంఆర్ఎస్)  పూర్తిగా స్థాయిలో అనుమతులు రాలేదు..నాగోల్ నుంచి మెట్టుగూడకు.. మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ వరకు గల రూట్లకు అనుమతి ఇచ్చిన సీఎంఆర్ఎస్ ....మధ్యలో కీలకమైన మెట్టుగూడ - ఎస్ఆర్ నగర్ మార్గానికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరిన్ని ట్రయల్ రన్స్ అవసరం..


మెట్రో రైలుకు సేఫ్టీ సర్టిఫికెట్ ఇవ్వాలంటే..కనీసం ఆరు నెలల పాటు ట్రయల్ రన్స్ చేయాల్సి ఉంది. మెట్టుగూడ నుంచి ఎస్ఆర్ నగర్ మధ్య కేవలం గత 15 రోజుల నుంచి మాత్రమే ట్రయల్ రన్స్ నడుస్తున్నాయి. కాగా ఈ విషయంపై హైద్రాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందిస్తూ ...ఈ విషయంలో తమకు 23వ తేదీ నాటికి అనుమతులు లభిస్తాయన్నారు.. అయితే ఇది కార్యరూపం దాల్చదని మరి కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైద్రాబాద్ మెట్రో ప్రారంభంపై నీలినీడలు కమ్మకున్నాయి.