Huzurabad by election Nominations begins TRS candidate Gellu Srinivas nomination filed on the first day: కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ అసెంబ్లీ స్థానానికి నామినేషన్లు శుక్రవారం ప్రారంభమయ్యాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తొలిరోజే నామినేషన్‌ దాఖలు చేశారు. మొదట కొమురవెల్లి మల్లన్న (komuravelli mallanna) ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత హుజురాబాద్‌ చేరుకుని ఆర్డీఓ కార్యాలయంలో (RDO Office) నామినేషన్ ( Nomination) పత్రాలు సమర్పించారు శ్రీనివాస్‌ యాదవ్‌. ఆయన వెంట ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్ బండ శ్రీనివాస్, పలువురు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నామినేషన్ కేంద్రం వద్ద 144 సెక్షన్


కోవిడ్ (Covid) నేపథ్యంలో నామినేషన్ కేంద్రంలో కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. నామినేషన్ కేంద్రం వద్ద 144 సెక్షన్, రెండు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. హుజూరాబాద్‌ (Huzurabad) ఉపఎన్నికకు ఈనెల 30న పోలింగ్‌ (polling) జరగనుంది. ఈనెల 8 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువుంది. అక్టోబర్ 11న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13. నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ( Eatala Rajender) ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది.


Also Read : Telangana Assembly Sessions: పంచాయతీల నిధుల మళ్లింపుపై కేసీఆర్ స్పష్టత.. సభలో తాము ఎవరి గొంతు నొక్కమని వెల్లడి


1,200 మంది హుజూరాబాద్‌లో నామినేషన్లు వేయాలని నిర్ణయం


కాగా టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై నిరసన గళం విన్పించడానికి ఫీల్డ్ అసిస్టెంట్లు, నిరుద్యోగులు హుజూరాబాద్‍ ఉప ఎన్నికను వేదికగా చేసుకుంటున్నారు. నిజామాబాద్ పసుపు రైతుల స్ఫూర్తితో తమ బాధను రాష్ట్రమంతటికీ తెలియజెప్పడానికి బరిలో దిగనున్నారు. దాదాపు 1,200 మంది హుజూరాబాద్ లో (Huzurabad)  నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. వీరిలో 1,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు కాగా 200 మంది నిరుద్యోగులు. ప్రతి జిల్లా నుంచి, ప్రతి మండలం నుంచి భాగస్వామ్యం ఉండేలా జిల్లాకు 31 మంది చొప్పున అసిస్టెంట్లు బరిలో హుజూరాబాద్‌ ఉపఎన్నికలో బరిలోకి దిగుతున్నారు. వీరంతా ఇప్పటికే డిక్లరేషన్ల ఫారాలు తీసుకున్నారు. మరో రెండు రోజుల్లో వీరంతా నామినేషన్లు వేయనున్నారు. ఇప్పుటికే ఖర్చుల కోసం భిక్షాటన చేస్తున్నారు. 


నేరుగా ఎన్నిక బరిలో


2019లో తమకు వ్యతిరేకంగా జారీ చేసిన సర్క్యులర్​ను రద్దు చేయాలని అడిగినందుకు 2020 మార్చి 23న రాష్ట్రవ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లందరినీ విధుల నుంచి తొలగించారు. దాంతో వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. తిరిగి విధుల్లోకి తీసుకుంటామని దుబ్బాక ఉప ఎన్నికప్పుడు మంత్రి హరీశ్ రావు వీరికి హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ఓడిపోవడంతో తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. నాగార్జునసాగర్‍ ఉప ఎన్నికప్పుడు, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే రిపీటైంది. దాంతో, ఉద్యోగాలను సాధించుకునేందుకు, తమకు జరిగిన అన్యాయాన్ని ప్రజల దృష్టికి తెచ్చేందుకు నేరుగా హుజూరాబాద్ ఉప ఎన్నిక (Huzurabad by election) బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు వారంతా.


Also Read : RBI New Rules: ఈఎంఐ వంటి చెల్లింపులకు ఇకపై అదనపు ధృవీకరణ అవసరం, ఇవాళ్టి నుంచే అమలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook