Huzurabad by-poll result live updates: హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటివరకు 13 రౌండ్లు ఓట్ల లెక్కింపు పూర్తి కాగా ఒకట్రెండు రౌండ్లు మినహా ప్రతీ రౌండులోనూ బీజేపి అభ్యర్థి ఈటల రాజేందర్ తన సమీప అభ్యర్థి, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై ఆధిక్యత కనబరుస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ తరపున ఆరుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఈటల రాజేందర్.. ప్రతీ ఎన్నికలోనూ విజయం సాధిస్తూ వచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఈటల రాజేందర్ పోటీ చేసిన ఎన్నికల వివరాలు, ఆయా ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థిపై సాధించిన మెజార్టీ వివరాలను ఓసారి పరిశీలిద్దాం. 


2004 సార్వత్రిక ఎన్నికలు: 
కమలాపూర్ నియోజకవర్గం: 
Eatala Rajender - ఈటల రాజేందర్‌కి లభించిన ఓట్లు : 68393.
ముద్దసాని దామోదర్ రెడ్డికి లభించిన ఓట్లు : 48774.
మెజారిటీ: 19619. 


2008 ఉప ఎన్నికలు: 
కమలాపూర్ నియోజకవర్గం: 
ఈటల రాజేందర్‌కి లభించిన ఓట్లు : 54092
Muddasani Damodar Reddy - ముద్దసాని దామోదర్ రెడ్డికి లభించిన ఓట్లు : 31808.
మెజారిటీ: 22,284. 


2009 సార్వత్రిక ఎన్నికలు : 
హుజూరాబాద్ నియోజకవర్గం : 
ఈటెల రాజేందర్‌కి లభించిన ఓట్లు : 56752 
కృష్ణమోహన్ వకులాభరణంకి లభించిన ఓట్లు : 41717.
మెజారిటీ: 15,035.


2010 ఉప ఎన్నికలు: 
Huzurabad constituency- హుజూరాబాద్ నియోజకవర్గం : 
ఈటెల రాజేందర్‌కి లభించిన ఓట్లు : 93026
ముద్దసాని దామోదర్ రెడ్డికి లభించిన ఓట్లు : 13799
మెజారిటీ: 79227. 


2014 సార్వత్రిక ఎన్నికలు: 
హుజూరాబాద్ నియోజకవర్గం: 
Eatala Rajender - ఈటెల రాజేందర్‌కి లభించిన ఓట్లు: 95315 
కేతిరి సుదర్శన్ రెడ్డికి లభించిన ఓట్లు  : 38278
మెజారిటీ: 57,037. 


2018 సార్వత్రిక ఎన్నికలు:
హుజూరాబాద్ నియోజకవర్గం:
ఈటల రాజేందర్‌కి లభించిన ఓట్లు : 104840
Padi Kaushik Reddy - కౌశిక్ రెడ్డికి లభించిన ఓట్లు : 61121. 
మెజారిటీ: 43719.


తన మొత్తం రాజకీయ జీవితంలో ఈటల రాజేందర్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా... అందులో రెండుసార్లు కమలాపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. చివరి నాలుగుసార్లు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలా హుజూరాబాద్‌లో వరుసగా ఈటల రాజేందర్ (Eatala Rajender) విజయకేతనం ఎగురవేస్తూ వస్తున్నారు.