Huzurabad bypoll on October 30 telangana CM KCR may campaign on 27th for Huzurabad by election: తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ( TRS) దూకుడు ప్రదర్శిస్తోంది. ఒకవైపు సంస్థాగత కార్యక్రమాలకు సిద్ధమవుతూ ఉంది. మరోవైపు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నెల 25న హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ప్లీనరీ, (TRS Plenary) అధ్యక్ష ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఆదివారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ శాసన, పార్లమెంటరీ పార్టీ (TRS Legislative, Parliamentary Party) సంయుక్తంగా భేటీ కానుంది. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర రాజకీయాలతో పాటు టీఆర్‌ఎస్‌ ప్రస్థానం, పార్టీ భవిష్యత్తు, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక వంటి అంశాలను టీఆర్‌‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చర్చించే అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

27న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్‌
 
ఇక హుజూరాబాద్‌ ఉపఎన్నిక (Huzurabad by election) పోలింగ్‌ ఈ నెల 30న ఉంది. అయితే ఈ నెల 27న ప్రచారం ముగియనుంది. కాగా హుజూరాబాద్‌ (Huzurabad) నియోజకవర్గంలో లేదంటే నియోజకవర్గానికి సమీప ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌ ప్రచార సభ ఉండే అవకాశముందని టీఆర్ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.


Also Read : Kerala Heavy Rains: కేరళలో భారీ వర్షాలు, కొట్టుకుపోతున్న ఇళ్లు


అలాగే వచ్చే నెల 15న వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ నిర్వహించే ‘తెలంగాణ విజయ గర్జన’ సన్నాహకాల్లో భాగంగా ఈ నెల 27న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యకర్తల సభలు నిర్వహించాలని నిర్ణయించింది టీఆర్ఎస్ పార్టీ. దీంతో హుజూరాబాద్‌ నియోజకవర్గానికి సరిహద్దులో ఉన్న హుస్నాబాద్‌ (Husnabad) లేదా ముల్కనూరులో (Mulkanur) భారీ సభ నిర్వహించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ సభ ద్వారానే పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అంశాలను ప్రస్తావించే అవకాశముందని సమాచారం.



మరోవైపు హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ నెల 25న జరిగే పార్టీ ప్లీనరీ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను టీఆర్‌ఎస్‌ (TRS) ఇప్పటికే ముమ్మరంగా చేపడుతోంది. ఆహ్వానితులకు మాత్రమే ప్లీనరీ సమావేశానికి హాజరుకావాల్సి ఉంది. సుమారు 14 వేల మంది ప్రతినిధుల కోసం ఆహ్వాన లేఖలను టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం సిద్ధం చేస్తోంది.


అలాగే వచ్చే నెల 15న వరంగల్‌లో జరిగే విజయగర్జన సభకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇక సుమారు మూడు నెలల క్రితం బీజేపీకి (BJP) రాజీనామా చేసిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు కూడా ముహూర్తం ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ (CM KCR) సమక్షంలో టీఆర్ఎస్‌లో (TRS) చేరనున్నారు.


Also Read : AP Power Crisis: ఏపీలో విద్యుత్ సంక్షోభం ఉందా లేదా, విద్యుత్ శాఖ ఏం చెబుతోంది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి