Huzurabad Bypoll Results 2021: తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ కల్గించిన హుజూరాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. టీఆర్ఎస్ వర్సెస్ ఈటెల రాజేందర్ మధ్య నువ్వా నేనా రీతిలో పోటీ సాగింది. హుజూరాబాద్ తుది ఫలితం ఎప్పటిలోగా వస్తుందనేది ఆసక్తిగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరి ఆసక్తి ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నికపైనే (Huzurabad Bypolls 2021)ఉంది. అధికార పార్టీలో మంత్రిగా, సీనియర్ నేతగా ఉండి మంత్రి పదవి పోగొట్టుకున్న ఈటెల రాజేందర్ పార్టీకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఉపఎన్నిక అనివార్యమైన పరిస్థితి. టీఆర్ఎస్ బహిష్కృత నేతగా బీజేపీలో చేరి పోటీ చేయడంతో పోటీ ఈటెల వర్సెస్ టీఆర్ఎస్‌గా మారింది. అటు టీఆర్ఎస్(TRS) నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో నిలిచారు. ఈ నేపధ్యంలో అందరి ఆసక్తి హుజూరాబాద్ ఫలితంపైనే ఉంది. 


హుజూరాబాద్‌లో (Huzurabad)గతంలో ఎన్నడూ లేనంతగా భారీ పోలింగ్ అంటే 86.64 శాతం నమోదైంది. మొత్తం 2 లక్షలకు పైగా ఓట్లు నమోదయ్యాయి. దాంతో హుజూరాబాద్ తుది ఫలితం సాయంత్రం వరకూ రావచ్చని అంచనా. హుజూరాబాద్ కౌంటింగ్ మొత్తం 22 రౌండ్లలో జరగనుంది. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై..ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. తొలి ఈవీఎం లెక్కింపు 8 గంటల 30 నిమిషాల తరువాతే ప్రారంభం కానుంది. రెండు విశాలమైన హాల్స్‌లో 306 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన 306 ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించనున్నారు. ముందుగా హుజూరాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామంతో లెక్కింపు ప్రారంభం కానుంది చివరిగా కౌంటింగ్ జరిగేది కమలాపుర్ మండలం శంభునిపల్లి ఈవీఎం ఓట్లు. మొత్తం 14 టేబుళ్లపై 22 రౌండ్ల కౌంటింగ్(Huzurabad Counting) జరగనుంది. కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నవారినే విధులకు అనుమతించారు. రెండు డోసులు పూర్తికానివారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ఒక్కొక్క రౌండ్‌కు అరగంట సమయం పట్టవచ్చు. అంటే 22 రౌండ్ల ఫలితాలు వెలువడేటప్పటికి 10 గంటల సమయం పట్టవచ్చు. అంటే తుది ఫలితం వచ్చేటప్పటికి సాయంత్రం 4-5 గంటలు కావచ్చని అంచనా.


ఈటెల రాజేందర్(Etela Rajender)రాజీనామా చేసినప్పటి నుంచే ప్రారంభమైన ప్రచారం హోరాహోరీగా సాగింది. అభ్యర్ధిని ఆలస్యంగా ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వెనుకబడింది. హుజూరాబాద్ విజయంపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తమ తమ అంచనాల్లో ఉన్నాయి. ప్రజల్లో ఉన్న సానుభూతి గెలిపిస్తుందని ఈటెల భావిస్తుంటే..సంక్షేమ పథకాలు, అభివృద్ధి పార్టీని పట్టం కడతాయనేది టీఆర్ఎస్ అంచనా. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా హుజూరాబాద్ ఉపఎన్నికపై భారీగా బెట్టింగులు మాత్రం జరుగుతున్నాయి. ఎవరు గెలుస్తారనే విషయంలో ఏపీ, తెలంగాణల్లో పెద్దఎత్తున బెట్టింగ్ కొనసాగుతోంది. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా బెట్టింగ్ నడుస్తోంది. కరీంనగర్, వరంగల్, గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఏపీలోని విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కడప, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీగా బెట్టింగ్ సాగుతోంది. ఎవరు గెలుస్తారు, ఎంత మెజార్టీ వస్తుంది, ఎన్ని ఓట్లు వస్తాయనే విభిన్న అంశాలపై కూడా బెట్టింగ్(Betting)ఊపందుకుంది. 


Also read: Huzurabad Bypoll 2021 Results: ఉత్కంఠ రేపిన హుజూరాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ మరి కాస్సేపట్లో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి