BJP Madhavi Latha: జాతీయ స్థాయిల్లో గొడవలు చేస్తాం.. పోలీసులకు బీజేపీ మాధవీలత మాస్ వార్నింగ్..
BJP Madhavi Latha: బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈసారి ఎన్నికలలో పోలీసులు బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన, ఎక్కడైన మజ్లీస్ కు సపోర్ట్ చేసినట్లు తమకు తెలిసిన బాగుండదంటూ హెచ్చరించారు.
Hyderabad bjp mp candidate madhavi latha mass warning to police: మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈనేపథ్యంలో అనేక పార్టీల రాజకీయ నాయకులు సుడీగాలి పర్యటనటు చేస్తున్నారు. ఓట్లను ప్రసన్నం చేసుకొవడానికి నానా తండాలు పడుతున్నారు. చివరిరోజు ఎక్కువ స్థానాలకు వెళ్లి ప్రచారం చేసేలా షెడ్యూల్ లు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో నేతలు తూటాల్లాంటి మాటలతో, అపోసిషన్ పార్టీలను ముప్పుతిప్పులు పెడుతున్నారు. నాయకులపై ఆరోపణలు, ప్రత్యారోపణలు పీక్స్ కు వెళ్లిపోయాయి. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ హైదరబాద్ ఎంపీ స్థానంపై స్పెషల్ గా ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ ఎంపీ టికెట్ ను విరించి అధినేత్రి మాధవీలతకు కేటాయించారు. ఈసారి ఎలాగైన ఎన్నికలలో గెలవాలని బీజేపీ జాతీయ నేతలు, స్టార్ క్యాంపెయినర్ లకూడా మాధవీలకు సపోర్ట్ గా ప్రచారం నిర్వహించారు.
Read more: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...
అదే విధంగా మాధవీలతకూడా ఎన్నికలలో తనదైన స్టైల్ లో ముందుకు వెళ్తున్నారు. ఓల్డ్ సిటీకి ఓవైసీ సోదరులు చేసిందేమనిలేదంటూ ఎద్దేవా చేశారు. పాతబస్తీ అన్నిరకాలుగా వెనుకబడిపోవడానికి ఓవైసీ సోదరులే కారణమంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అంతేకాకుండా.. మోదీ హాయాంలో దేశంలో ఎన్నో డెవలప్ మెంట్ కార్యక్రమాలు జరిగాయని అన్నారు. ఇక హోమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, తమిళిసై, రాజాసింగ్, కిషన్ రెడ్డి మాధవీలతకు సపోర్ట్ గా ప్రచారం నిర్వహించారు. ఇటీవల అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ కూడా మాధవీలతకు సపోర్ట్ గా ప్రచారం నిర్వహించారు.
ఓవైసీ సోదరులను తన విమర్శలతో నవనీత్ కౌర్ ఉక్కిరిబిక్కిరి చేశారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే పాకిస్థాన్ కు ఓటు వేసినట్లే అంటూ విమర్శించారు.ఇదిలా ఉండగా.. ఎన్నికలు గడువు ముగుస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికలను సజావుగా సాగేలా చర్యలు తీసుకొవాలన్నారు. పోలీసులు కావాలని బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడితే సహించబోమని హెచ్చరించారు.
పాతబస్తీలో ఓటింగ్ సమయంలో.. బురఖాల్లో చిన్న పిల్లలు, మగవాళ్లతో వచ్చి దొంగ ఓట్లు వేయిస్తున్నారని, ఇలాంటి వారిని కట్టడి చేయాలని సూచించారు. ఫెస్ ఐడెంటీఫికేషన్ చేస్తామంటే, తమ పోలింగ్ ఏజెంట్ లను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదంటూ పోలీసులను హెచ్చరించారు. మజ్లీస్ అక్రమాలకు పాల్పడితే, జాతీయ స్థాయిలో బ్యాన్ చేసేలా పోరాటం చేసేలా పోరాటం చేస్తామంటూ పోలీసులకు మాధవీలత వార్నింగ్ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter