Mla Padmarao: పాముతో కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే పద్మారావు.. అసలేం జరిగిందంటే..?
Hyderabad: కొన్నిరోజులుగా పాములు విపరీతంగా సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంగపుత్రులు తమ ఏరియాలో ఉన్న చెత్త, చెదారాన్ని తొలగించాలంటూ స్థానిక అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు.
Hyderabad brs mla padma rao come to the office with a snake: కొన్నిరోజులుగా భారీగా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో అనేకచోట్ల గుబురుగా చెట్లు, చెదారంలు పేరుకుపోతున్నాయి. సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే పాములు, విషపురుగుల సంచారం ఎక్కువగా ఉంటుంది. అడవులు,చెట్లుపేరుకుపోయి ఉన్న ప్రదేశాల్లో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఇదిలా ఉండగా.. వెస్టేజ్ లు ఎక్కువగా ఉన్న చోట పాములు ఎక్కువగా కన్పిస్తుంటాయి. ఈ క్రమంలో వర్షాకాలం వచ్చిందంటే చాలు పాముల కాటుకు సంబంధించిన ఘటనలు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వ్యవసాయం పనులు కోసం, వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు.
Read more: Serial bride: నిత్య పెళ్లి కూతురికి హెచ్ఐవీ పాజిటివ్.. లబో దిబో మంటున్న యువకులు.. ఎక్కడో తెలుసా..?
ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న కూడా, తమ జీవితాలను రిస్క్ లో పడేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లో బోయబస్తీలో నిత్యం పాములు సంచరిస్తున్నాయని ప్రజలు తెగ భయపడిపోతున్నారు. ఇప్పటికే పలు మార్లు అధికారులకు తమ బాధలు చెప్పుకున్నారు. అయిన కూడా అధికారుల నుంచి తగిన రెస్పాన్స్ మాత్రం కరువైంది.
సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ను కలిసి, బస్తీవాసులు తమ గోడును చెప్పుకున్నారు.వెంటనే ఎమ్మెల్యే అక్కడి ప్రదేశాన్ని వెళ్లారు. ఆ సమయంలో కూడా అక్కడ ఒక చిన్న పాము కన్పించింది. వెంటనే అక్కడున్న కొందరు ఆ చిన్న పామును పట్టుకుని బాటిల్ లో బంధించారు.
ఈ క్రమంలో.. ఆ పాము పిల్లను పట్టుకుని ప్లాస్టిక్ బాటిల్‌లో ఉంచి సోమవారం సీతాఫల్‌మండిలోని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావుగౌడ్ కార్యాలయానికి తీసుకొచ్చారు. బాటిల్‌లో ఉన్న పాము బుస కొట్టడం చూసి ఎమ్మెల్యే పద్మారావుతో పాటు అక్కడున్నవారు షాకింగ్ కు గురయ్యారు. తమ బస్తీలో పాముల బెడద ఎక్కువగా ఉన్నదని, గతంలో ఒక పాప పాముకాటుతో మృతి చెందిందని బస్తీవాసులు ఎమ్మెల్యేకు వివరించారు.
Read more: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..
వెంటనే పద్మారావు గౌడ్.. అక్కడున్న అధికారులకు వీడియోకాల్ చేసి, ఆ పాము పిల్ల ఉన్న బాటిల్ ను చూపించారు. ఇప్పటికైన తగిన విధంగా చర్యలు తీసుకొవాలని కోరారు. కొన్నిరోజులుగా బస్తీలో పాములు ఎక్కువగా సంచరిస్తుండటంతో, బస్తీ ప్రజలు భయంతో బిక్కు బిక్కు మంటు ఉన్నారు. అంతేకాకుండా..చిన్ని పిల్లలు, బస్తీలలో ఎక్కువగా ఆడుకుంటు ఉంటారు. అందుకే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ప్రమాదాలకు గురౌతారో అని ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై అధికారులు తగిన విధంగా స్పందించి చర్యలు తీసుకొవాలని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి