HCU Admission Exam:హెచ్ సీయూ అడ్మిషన్లకు సిద్ధం, ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల
HCU Admission Exam: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో తెలంగాణలో లాక్‌డౌన్ తొలగించేశారు. ఇప్పుడిక ప్రభుత్వం విద్యా సంవత్సరంపై దృష్టి సారించింది. అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సైతం ఇందుకు సిద్దమైంది.
HCU Admission Exam: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో తెలంగాణలో లాక్‌డౌన్ తొలగించేశారు. ఇప్పుడిక ప్రభుత్వం విద్యా సంవత్సరంపై దృష్టి సారించింది. అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సైతం ఇందుకు సిద్దమైంది.
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)ఉధృతి గణనీయంగా తగ్గింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ తొలగించింది. విద్యాసంవత్సరం, పరీక్షలపై దృష్టి సారించింది. జూలై 1 నుంచి స్కూల్స్, కళాశాలలు తెరిచేందుకు యోచిస్తోంది. అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ సైతం ఇందుకు సిద్దమైంది. హెచ్‌సీయూ 2021-22 విద్యా సంవత్సరం అడ్మిషన్లను ప్రారంభిస్తోంది. దీనికి సంబంధించిన ప్రవేశ పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 20 వరకూ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశవ్యాప్తంగా 39 కేంద్రాల్లో ఆగస్టు- సెప్టెంబర్ నెలల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష(HCU Admission Notification) జరగనుంది.
హెచ్‌సీయూలో(HCU) మొత్తం 17 ఇంటిగ్రేటెడ్, 46 పీజీ, 10 ఎంటెక్, 44 పీహెచ్‌డీ కోర్సులకు సంబంధించి 2 వేల 328 సీట్లు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంటెక్ మోడలింగ్ అండ్ సిమ్యులేషన్, ఎంపీఏ మ్యూజిక్, పబ్లిషింగ్‌లో సర్టిఫికేట్ కోర్సుల్ని కొత్తగా ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు ఎంసీఏ, ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఎంబీఏ, ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ కోర్సుల్లో నిమ్‌సెట్, గేట్, జేఈఈ, క్యాట్, జీఏటీ-బీ వంటి పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా అడ్మిషన్ ఇస్తారు.
Also read: Minister Harish Rao convoy accident: కారు ప్రమాదంపై స్పందించిన మంత్రి హరీష్ రావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook