హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాత్రి 10:00  గంటల నుండి ఉదయం 05:00 గంటల వరకు హైదరాబాద్  ప్రతి  పొలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యమైన ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు  నిర్వహిస్తామని నగర కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.హైదరాబాద్ నగర పరిధిలో  పోలీసు బృందాలు స్థానిక సంచార టీమ్లుగా ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించి, వీడియో రికార్డింగ్ చేయాలని, పట్టుబడ్డ వ్యక్తుల యొక్క వాహనాలు స్వాధీనంచేసుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమీషనర్ తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా, బయట తిరగకుండా అదుపులో ఉoచుకోగలరని సూచించారు. మద్యం సేవించి  స్నేహితులతో  రోడ్డుపై ప్రయాణించినట్లయితే ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయే  అవకాశం ఉన్నందున, ఈ సంతోషకరమైన దినాన్ని విషాదకరమైన దినముగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలిపారు. కొత్త సంవత్సరానికి ఎన్నో ఆశలతో, ఆశయాలతో, మరెన్నో లక్ష్యాలతో, ఎంతో సంతోషంతో స్వాగతం పలుకుతూ యువకులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన బందోబస్తు మరియు నిఘా ఏర్పాటు చేయడం  జరిగింది. అపరిచిత, అనుమానిత వ్యక్తులు కనబడితే విచారించి అదువులోకి తీసుకుంటామని తెలిపారు. వాహనాలకు నెంబర్ లేకుండా, సరైన ధ్రువపత్రాలు, లైసెన్స్ లేకుండా నడుపే వాహనాలను స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర కమీషనర్ హెచ్చరించారు.



డిసెంబర్ 31నాడు రాత్రి తీసుకోవలసిన జాగ్రత్తలకు సంబంధించి భద్రత, ప్రమాద  నష్టనివారణ దృష్ట్యా నగర పోలీసు శాఖ వారు చేయు సూచనలు


1, మైనర్, యువకులకు వాహనాలు ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరగవచ్చు కావున తల్లిదండ్రులు మైనర్ యువకులకు వాహనాలు  ఇవ్వరాదు. పట్టుబడితే కేసులు నమోదు చేయడం జరుగుతుంది. 


2, అధిక వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కావున అధిక వేగంతో వాహనాలు నడుపరాదు. 


3, మద్యం సేవించి వాహనాలు నడిపే వ్యక్తుల గురించి జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేయడం జరుగుతుంది.


4, అధిక శబ్దాలను చేస్తూ అజాగ్రత్తగా వాహనాలు నడుపరాదు అది మీ ప్రాణాలకే ప్రమాదం.


5, గుంపులు గుంపులుగా రోడ్లపై కేకలు వేస్తూ తిరగడం మరియు వాహనాలతో ర్యాలిగా వెళ్లడం చేయరాదు.
 
6, రోడ్లపై టపాసులు, మైకులు ఎక్కువ సౌండ్ పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. 


7. డీజే లు నిషేధించడం జరిగింది. డీజేలు పెట్టినట్లయితే, సీజ్ చేసి
చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


8. ఇండ్లపైన, ప్రవేట్ ఆస్తులపై, వీధిదీపాలపై రాళ్లు వేయడం, అద్దాలను పగలగొట్టడం, మహిళలను ఇబ్బంది పెట్టినా, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


9. త్రిబుల్ రైడింగ్ ,సైలెన్సర్లను తీసివేసి వాహనాలు నడపడం శబ్దకాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే వాహనాలు సీజ్ చేస్తామన్నారు.


10. బహిరంగ ప్రదేశంలో మద్యపానం నిషేధించబడింది. బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


పోలీస్ శాఖ తీసుకునే  ముందస్తు రక్షణచర్యలకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ, ఈ నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని హైదరాబాద్ నగర కమీషనర్ అంజనీ కుమార్ ఆకాంక్షించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..