Hyderabad: సినిమా ప్రదర్శన 15ని. ఆలస్యం-ఆ మల్టీప్లెక్స్‌కు రూ.1లక్ష జరిమానా
Kacheguda Inox multiplex fined Rs.1lakh : సినిమా ఆలస్యంగా ప్రదర్శించి ప్రేక్షకుల సమయాన్ని వృథా చేసినందుకు హైదరాబాద్‌లోని ఓ మల్టీప్లెక్స్ యాజమాన్యానికి వినియోగదారుల కమిషన్ రూ.1లక్ష జరిమానా విధించింది.
Kacheguda Inox multiplex fined Rs.1lakh : హైదరాబాద్‌లోని (Hyderabad) కాచిగూడ ఐనాక్స్ మల్టీప్లెక్స్ యాజమాన్యానికి వినియోగదారుల కమిషన్ షాకిచ్చింది. సినిమాను ఆలస్యంగా ప్రదర్శించి ప్రేక్షకుల సమయాన్ని వృథా చేసినందుకు రూ.1లక్ష జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్దంగా వాణిజ్య ప్రకటనలతో ప్రేక్షకుల సమయాన్ని వృథా చేయడాన్ని కమిషన్ తప్పు పట్టింది. విజయ్ గోపాల్ అనే ఓ వ్యక్తి ఐనాక్స్ యాజమాన్యంపై వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
హైదరాబాద్‌లోని తార్నాకకు (Hyderabad Tarnaka) చెందిన విజయ్ గోపాల్ అనే వ్యక్తి జూన్ 22, 2019న కాచిగూడలోని ఐనాక్స్ మల్టీప్లెక్స్‌లో (Inox) 'గేమ్ ఓవర్' అనే సినిమా చూసేందుకు వెళ్లాడు. సినిమా టికెట్‌పై ఉన్న ప్రకారం సాయంత్రం 4.30గంటలకు షో మొదలు కావాల్సి ఉంది. కానీ 15 నిమిషాలు ఆలస్యంగా 4.45గంటలకు షో వేశారు. ఆ 15 నిమిషాలు వాణిజ్య ప్రకటనలు వేశారు. దీనిపై విజయ్ కుమార్ థియేటర్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
విజయ్ కుమార్ ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ విచారణ చేపట్టింది. తెలంగాణ సినిమా రెగ్యులేషన్ చట్టం-1970, రూల్ నం.41 ప్రకారం కేవలం 5 నిమిషాలు ఉచిత ప్రకటనలు మాత్రమే వేయాలని... వాణిజ్య ప్రకటనలు వేయడం నిబంధనలకు విరుద్ధమని కమిషన్ పేర్కొంది. టికెట్‌పై (Movie Ticket) ముద్రించిన సమయానికే మూవీ షో ప్రదర్శించాలని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు కాచిగూడ ఐనాక్స్ మల్టీప్లెక్స్‌కు రూ.1లక్ష జరిమానా విధించింది. అలాగే పరిహారం, ఖర్చుల కింద ఫిర్యాదుదారుడికి రూ.10వేలు చెల్లించాలని ఆదేశించింది. జరిమానా సొమ్మును హైదరాబాద్ (Hyderabad) పోలీస్ కమిషనర్‌కి చెల్లించాలని ఆదేశించింది.
Also Read: Video: సింహాన్నే చిత్తు చేసిన దున్న-కింగ్ ఆఫ్ జంగిల్‌కు చావుదెబ్బ రుచి చూపించిందిగా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook