Online Games Claims Hyderabad Mans Life | ఆన్‌లైన్ గేమ్ వల్ల డబ్బు పోయిందని  వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో చోటు చేసుకుంది. స్థానికంగా నివసించే జగదీష్ (33) ఆన్‌లైన్ గేమ్స్ లో కొన్ని లక్షల రూపాయలు కోల్పాయడని సమాచారం. పోలీసులు ప్రకారం గత కొంత కాలంగా జగదీష్ ఆన్‌లైన్ గేమ్స్ కు బాగా బానిసగా మారాడట. బంధు మిత్రుల నుంచి డబ్బు అప్పుగా తీసుకుని గేమ్స్ ఆడేవాడట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | WhatsApp OTP Scam | అంటే ఏంటి ? దీని నుంచి తప్పించుకోవడం ఎలా ?


ఆన్‌లైన్ గేమ్స్ (Online Games) ఆడి సులభంగా డబ్బు సంపాదించాలని జగదీష్ ప్రయత్నించాడని సమాచారం. ఇలా చేసి కొంత డబ్బు సంపాదించి కొన్ని అప్పులు తీర్చేశాడట. అయితే చాలా పెద్ద మొత్తం ఇంకా బాకీగా మిగిలే ఉంది అని తెలిసింది. అప్పులు ఇచ్చిన వారికి చెల్లించేందుకు డబ్బు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. మరణానికి ముందు ఒక సెల్పీ వీడియో తీసుకున్న జగదీష్ తన భార్యను క్షమించమని కోరాడు. 


అంతకు ముందే సుమారు రూ.12 లక్షల అప్పు తిరిగి చెల్లించి జగదీష్ ఆన్‌లైన్ గేమ్స్ ఆడేందుకు మళ్లీ కొత్త అప్పు చేశాడట. ఇలా చేసి డబ్బు సంపాదించి మిగిలి ఉన్న అప్పులు (Loans) చెల్లించాలి అని భావించాడట. అయితే ఉన్నవి కూడా పోవడంతో ఏం చేయాలో తోచక ప్రాణాలు తీసుకున్నాడట. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు భౌతిక దేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR