Hyderabad Rape Incident: హైదరాబాద్‌లో దారుణం వెలుగుచూసింది. ఉద్యోగం పేరు చెప్పి ఓ యువకుడు యువతిని మోసం చేశాడు. ఆమెను నమ్మించి హోటల్ గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు పొక్కితే.. అత్యాచార ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తానని బెదిరించాడు. ఈ నెల 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా కొలిమిగండ్లకు చెందిన ఓ కుటుంబం హైదరాబాద్‌లోని చైతన్యపురి కాలనీలో నివాసం ఉంటోంది. ఆ కుటుంబానికి చెందిన యువతి (19) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో టెలీకాలర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో సిద్దార్థరెడ్డి అనే యువకుడు యువతి ఫోన్ నంబర్ సంపాదించి ఆమెను ట్రాప్ చేశాడు.


తన కంపెనీలో ఉద్యోగం ఉందని నెలకు రూ.18వేలు జీతం ఇస్తామని.. ఆసక్తి ఉంటే వచ్చి చేరాలని ఆమెకు ఫోన్ ద్వారా చెప్పాడు. సిద్దార్థరెడ్డి మాటలు నమ్మిన యువతి ఈ నెల 9న దిల్‌సుఖ్‌నగర్‌లో అతన్ని కలిసేందుకు వెళ్లింది. అక్కడినుంచి సిద్దార్థరెడ్డి ఆమెను కారులో ఎక్కించుకుని ఎర్రగడ్డకు తీసుకెళ్లాడు. కారులో వెళ్తున్నప్పుడే ఆమె సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలు, రెజ్యుమ్ తీసుకున్నాడు.


ఎర్రగడ్డకు వెళ్లాక యువతిని స్థానికంగా ఉన్న ఓయో హోటల్‌కు తీసుకెళ్లాడు. హోటల్‌కి ఎందుకు తీసుకొచ్చావని యువతి ప్రశ్నించగా బుకాయించే ప్రయత్నం చేశాడు. అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చేందుకు కొంత సమయం పడుతుందని... ఆలోపు హోటల్ గదిలోనే భోజనం చేద్దామని చెప్పాడు. ఇద్దరు కలిసి భోజనం చేశాక.. యువతిపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే.. అత్యాచార ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తానని బెదిరించాడు. 


ఎలాగోలా సిద్దార్థరెడ్డి బారి నుంచి తప్పించుకుని బాధిత యువతి ఇంటికెళ్లింది. జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పి.. వారితో కలిసి చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.


Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హత్య కుట్ర భగ్నం...


Also Read: PBKS vs RCB Records: అరుదైన రికార్డు నెలకొల్పిన పంజాబ్‌.. బెంగళూరు ఖాతాలో చెత్త రికార్డు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook