హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు ట్రాక్ మారిందన్న వదంతులపై స్థానిక మీడియాలో జోరుగా కథనాలు వెల్లవడ్డాయి. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త  తెగ హల్ చల్ చేసింది.  తాజా వార్తలతో హైద్రబాద్ వాసులకు మెట్రో లో ప్రయణించాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. బాబోయ్ ..మెట్రో రైలు ట్రాక్ మారిందా..!! అంటూ జనాల్లో జోరుగా చర్చ మొదలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఊహాగానాలను నమ్మెద్దు..


తాజా వదంతులపై  మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి  స్పందించారు. మీడియాలో వస్తున్న కథనాలు  ఊహాగానాలని ఆయన కొట్టిపారేశారు.మెట్రో రైలు రాంగ్ రూట్ వార్తలు అవాస్తవమన్నారు .వాస్తవాలు తెలియకుండా ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయొద్దని కోరారు.


అసలు జరిగింది ఇది..


ప్రెస్ మీట్ లో మెంట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నగరంలో భారీ గాలీ వీచిందని....ఈ  భారీ ఈదురుగాలుల ధాటికి నాంపల్లి అసెంబ్లీ స్టేషన్ వద్ద ట్రాక్‌పై ఓ మెరుపు అరెస్టర్ రాడ్ పడింది. అందువల్ల ముందు జాగ్రత్త చర్యగా ఓవర్ హెడ్ ఎలెక్ట్రికల్ పవర్ స్విచ్ ఆఫ్ చేసి.. ట్రాక్ పై  పడిన రాడ్‌ను తొలగించామన్నారు. అయితే రైలుకు ఓహెచ్‌ఈ శక్తి లేకపోవడంతో.. మరమ్మతు పనుల కోసమే అరగంట పాటు రైలును నిలిపివేయాల్సి వచ్చిందని ఎండీ వివరించారు.