హైదరాబాద్ కు మరి కొన్ని రోజుల్లో మెట్రో రైలు అందుబాటులోకి వస్తోంది. ఈ నెల 28న ప్రధాని మోడీ  చేతుల మీదుగా దీన్ని ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెట్రోలో ట్రావెల్ చేసే ప్రయాణికులకు అధికారులు పలు షరతులు విధించారు. ...మెట్రో రైల్లో కానీ..   స్టేషన్లో కానీ పాటించే నింబంధనలకు సంబంధించిన ఓ జాబితా విడుదల చేయారు.. అవేంటో తెలుసుకుందామా మరి...!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

* రైలు కోసం వేచి ఉన్నప్పుడు పసుపురంగు లైన్ దాటరాదు
* రైలు బోగీలకు నోటీసులు అంటించరాదు
* చిన్నారులను స్టేషన్ ప్లాట్ ఫామ్ పై వదిలేయరాదు
*  రైలు కోసం ప్లాట్ ఫామ్ పై పరుగెత్తరాదు
* రైళ్లలో ఆహారం, తినుబండారాలు తీసుకోకూడదు
*  రైళ్లలో పెంపుడు జంతువులను తీసుకెళ్లకూడదు
* ప్రయాణ సమయంలో డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయరాదు
* డోర్లకు ఆనుకుని నిల్చోరాదు
* స్టేషన్ పరిసరాల్లోని నిషిద్ధ ప్రాంతాల్లో కూర్చోరాదు
* రైల్లోకి ప్రవేశించిన తర్వాత ఫొటోలు తీయరాదు 
* స్టేషన్ పరిసరాలు, బోగీల్లో ఉమ్మి వేయరాదు
* ధూమపానం,పాన్ నమలడం, ఆల్కహాల్ నిషేదం
* బోగీ డోర్లు తెరుచుకునే లేదా మూసుకునే సమయంలో వాటి మధ్య నిల్చోరాదు
* తమ స్మార్ట్ కార్డును (లేదా) టోకెన్ ను ఇతర ప్రయాణికులతో పంచుకోరాదు


పై షరతులు, నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాల్సి ఉంది... కాదని ఎవరైనా రూల్స్ ను అతిక్రమిస్తే  కఠిన చర్యలను తీసుకుంటామని హైద్రాబాద్ మెట్రో కమిషనర్ కార్యాలయం తెలిపింది.