హైదరాబాద్: మెట్రో స్మార్ట్ కార్డు వినియోగదారులకు గుడ్ న్యూస్. ప్రయాణ సమయంలో టికెట్ ధరపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఎల్ అండ్ టీ ప్రకటించింది. ఇప్పటి వరకు స్మార్ట్ కార్డుపై 5 శాతమే రాయితీ ఉండేది. దాన్ని మరో 5 శాతం పెంచిందన్న మాట. కాగా తాజాగా ప్రకటించిన రాయితీ వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎల్ అండ్ టీ నిబంధనల ప్రకారం ఏడాది కాలానికి రూ.200 చెల్లించి స్మార్ట్ కార్డు తీసుకోవాలి..ఇందులో రూ.100 ప్రయాణానికి వినియోగించుకోవచ్చు. గరిష్ఠంగా రూ.3వేల వరకు రీఛార్జ్‌ చేసుకోవచ్చు. పేటీఎం ద్వారా చేసుకున్న తొలిసారి రూ.100, ఆపైన రీఛార్జ్‌ చేసుకుంటే రూ.20 క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ కూడా ఉంది.


హైద్రాబాద్ మెట్రో లో ఇప్పటివరకు 1.70 లక్షల స్మార్ట్‌కార్డులు అమ్ముడైన‌ట్లు ఎల్ అండ్ టీ తెలిపింది. దీన్ని మరింత పెంచాలనే ఆలోచనతో ఈ మేరకు రాయితీ ప్రకటించింది. స్మార్ట్ కార్డును వినియోగిస్తే క్యూలైన్లో నిలబడి టికెట్ తీసుకునే పని ఉండదు. దీంతో సమయం వేస్ట్ కాకుండా ఉంటుంది. దీంతో పాటు డబ్బు కూడా ఆదా చేసినట్లవుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. మెట్రో స్మార్ట్ కార్డు తీసుకోండి మరి..