Hyderabad Metro to start services from 6 am : మెట్రో రైలు ప్రయాణికులకు తాజాగా గుడ్‌న్యూస్‌చెప్పింది హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ (హెచ్‌ఎంఆర్‌-HMRL ) ( Hyderabad Metro Rail Limited). ఇకపై ఉదయం ఆరు గంటల నుంచే మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. రేపటి నుంచే అంటే నవంబర్‌ 10 నుంచే ఉదయం 6 గంటలకు మెట్రో రైలు (metro train) సేవలు ప్రారంభం కానున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే రాత్రి 10.15 గంటలకు చివరి స్టేషన్‌ నుంచి మెట్రో రైలు (metro train) బయలుదేరుతుంది.. రాత్రి 11.15 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. పురపాలక, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ (Municipal Administration and Urban Development Minister KT Rama Rao) చేసిన ట్వీట్ కు మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ. ఎన్వీ.ఎస్.రెడ్డి స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు.


Also Read : India Vs Pakistan: టీ20ల్లో ఆల్‌ టైమ్‌ రికార్డు సృష్టించిన దాయాదుల పోరు


అభినవ్ సుదర్శి ( Abhinav Sudarsi) అనే ప్రయాణికుడు మెట్రో రైలు కష్టాలపై కొన్ని వీడియోలను మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉదయం ఆరుకే ప్రయాణికులు మెట్రో స్టేషన్లకు వస్తున్నారు.. కానీ సర్వీసులు ఉదయం ఏడు గంటలకు కానీ ఫ్రారంభం కావట్లేదు అంటూ కేటీఆర్ (KTR) దృష్టికి తీసుకువెళ్లాడు. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఉదయం ఆరు నుంచే మెట్రో రైలు సేవలను ప్రారంభించాలని కోరాడు. అంతేకాదు ఆ పోస్టులో ఉదయం ఆరుకు మెట్రో స్టేషన్లలో (metro stations) ఉన్న ప్రయాణికుల రద్దీకి సంబంధించిన షార్ట్ వీడియోను కూడా యాడ్ చేశాడు. 


దీనికి మంత్రి కేటీఆర్‌ (KTR) సానుకూలంగా స్పందించి మెట్రో (metro) ఎండీ దృష్టికి తీసుకెళ్లడంతో మెట్రో వేళ్లలో మార్పులు జరిగాయి. ఇలా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ (Hyderabad) వాసుల కల నెరవేరింది.


Also Read : Man kills wife : టవల్ ఆలస్యంగా ఇచ్చిందని భార్యనే చంపిన భర్త


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook