Hyderabad MMTS Services: కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ ఎత్తివేయడంతో తెలంగాణలో పలు సర్వీసులను పునరుద్ధిరిస్తున్నారు. ఈ క్రమంలో నేటి నుంచి హైదరాబాద్ మెట్రోరైలు సేవలు పొడిగించారు. ఆర్టీసీ బస్సు సర్వీసులు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు యథాతథంగా తెలంగాణలో సేవలు అందిస్తున్నాయి. ఎంఎంటీఎస్ రైలు సర్వీసులపై అప్‌డేట్ వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేయడంతో హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరించాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జూన్ 23వ తేదీ నుంచి హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. గత ఏడాది దేశంలో కరోనా వ్యాప్తి సమయంలో మార్చి 23న రద్దుచేసిన Hyderabad ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు 15 నెలల తరువాత మళ్లీ సేవలు అందించనున్నాయి. అయితే తొలుత 10 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. క్రమక్రమంగా రైలు సర్వీసులను పెంచాలని యోచిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.


Also Read: WhatsApp Stickers: వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్, త్వరలోనే సరికొత్త ఫీచర్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook