Natu kodi Meat: నాన్‌వెజ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్..ఆన్‌లైన్‌లో అమ్మకానికి నాటుకోడి..!
Natu kodi meat available online: నాన్‌వెజ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇక నుంచి నాటుకోడి మాంసాన్ని ఆన్‌లైన్‌లో విక్రయించనుంది ఓ సంస్థ. అది కూడా మన హైదరాబాద్ లో. పూర్తి వివరాల్లోకి వెళితే..
Natu kodi meat available online: దేశవ్యాప్తంగా రోజురోజూకు చికెన్ కు డిమాండ్ పెరుగుతోంది. ఫారం, బ్రాయిలర్ ఇలా రకరకాల కోడి మాంసాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నాటుకోడి (Natu kodi meat) మాంసానికైతే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. నిఖార్సైన నాటుకోడి దొరికాలి గానీ..ఎంతరేటు అయినా కొనేయడానికి రెడీగా ఉన్నారు మాంసప్రియులు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే..నాటుకోడి మాంసం మీ ఇంటికే తీసుకురానుంది ఓ సంస్థ. అది కూడా మన హైదరాబాద్ లో.
దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నాటుకోడి మాంసం ఆన్‌లైన్‌లో (Natu kodi meat available online) విక్రయించనుంది కంట్రీ చికెన్ కో సంస్థ (Country Chicken Co. Company). దీని కోసం మూడు సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కంట్రీ చికెన్ కో సంస్థ.. క్లాసిక్ ఆంధ్రా, టెండర్ తెలంగాణ, మైసూర్ క్వీన్, వారియర్, కడక్‌నాథ్ రకాల్లో నాటుకోడి మాంసం అందిస్తోంది. నేచురల్ పద్దతుల్లో పెంచిన నాటుకోడి మాంసాన్నే విక్రయిస్తామని కంట్రీ చికెన్ కో సంస్థ చెబుతోంది.
కేజీ నాటుకోడి మాంసం....కడక్‌నాథ్ రూ. 909, క్రాసిక్ ఆంధ్రా రూ. 584, టెండర్ తెలంగాణ రూ. 487, మైసూర్ క్వీన్ రూ.552లుగా ఉంది. ధరలు వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచింది కంట్రీ చికెన్ కో సంస్థ. పందెం కోడి రకానికి సంబంధించి వారియర్ అత్యంత ఖరీదైనది. వారియర్ నాటుకోడి మాంసం కిలో రూ.2599లగా ఉంది. ఈ కోళ్లకు బాదంపప్పు, జీడిపప్పు వంటి ఖరీదైన డ్రైప్రూట్స్ ను మేతగా వేస్తారు. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. బోయిగూడ, ప్రగతినగర్, దిల్‌సుఖ్‌నగర్‌లలో ఈ సంస్థకు చెందిన సెంటర్లు ఉన్నాయి.
Also Read: Medaram Jatara: మేడారం జాతరకు హెలికాప్టర్ లో వెళ్లొద్దామా..! పూర్తి వివరాలివిగో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook