Hyderabad news Engineer commits suicide in rajendranagar after girl friend: చాలా మంది యువత ప్రేమ పెళ్లిళ్లుచేసుకొవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లవ్ అండ్ అరెంజ్ పెళ్లిళ్ల వల్ల యువతీ యువకులు, కొంత కాలంపాటు కలిసి జర్నీ చేస్తారు. దీంతో తమ ఆలోచనలు, ప్రయారిటీస్ అన్ని ఒకరితో మరోకరు షేర్ చేసుకుంటారు. ఇవన్ని నచ్చితే లైఫ్ లో పెళ్లి వరకు వెళ్తుంటారు. ఒక వేళ తమ ఆలోచనలు, అభిరుచులు మ్యాచ్ కాకుంటే.. మధ్యలోనే తమ ప్రేమకు ఫుల్ స్టాప్ చెప్పేస్తున్నారు. కానీ కొంత మంది యువత మాత్రం పవిత్రమైన ప్రేమను తమ అవసారాలకోసం వాడుకుంటున్నారు. ఇలాంటి విషయాల్లో అబ్బాయిలు, అమ్మాయిలు ఏమాత్రం తీసిపోకుండా ఒకరికి మరోకరు పోటీగా ఉంటున్నారు. కొన్ని చోట్ల అబ్బాయిలు, ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తుంటే, మరికొన్ని చోట్ల అమ్మాయిలు, కూడా బాయ్స్ తో సీక్రెట్ లవ్ ఎఫైర్స్ నడిపిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Ayodhya Ram lalla: ద్యావుడా.. అయోధ్యలో భక్తులకు తిలకం పెడుతూ బాలుడు ఈ రేంజ్ లో సంపాదిస్తున్నాడా..?.. వైరల్ వీడియో..


ప్రేమించుకుంటున్నాం అంటూ అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతూ, చేయరాని అడ్డమైన పనులు చేస్తుంటారు. ఆ తర్వాత కొందరు తమ అవసరాలు తీరిపోయాక.. ఏదో లేని పోనీకారణాలతో ప్రేమించిన వారిని దూరం పెడుతున్నారు. అప్పటిదాక ఎంతో క్లోజ్ గా ఉన్న వాళ్లు ఒక్కసారిగా తమ అస్సలు రంగు చూపిస్తున్నారు. ఇంట్లో వాళ్లు ఒప్పుకొవట్లేదని, మనిద్దరికసెట్ కాదని లేని విషయాలు చెబుతూ ప్రేమించిన వాళ్లను చీట్ చేస్తుంటారు. కొందరైతే ఒక లవర్ ను మెంటెన్ చేస్తునే.. ఎవరైన బెటర్ దొరికితే, వీళ్లను వదిలేసి వాళ్లతో ప్రేమాయణం మొదలు పెట్టేస్తున్నారు. ఇలాంటి విషయాలలో నిజంగా మనస్పూర్తిగా ప్రేమించిన వాళ్లు తమ లవర్ చేసిన మోసాలు భరించలేక దారుణాలు చేస్తున్నారు. కొందరు తమ లవర్ లను హత్యలు చేయడం, సుపారీ ఇచ్చి చంపించడం, యాసిడ్ దాడులకు పాల్పడటం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఎంతో ఎమోషనల్ అయి లవర్ లు సూసైడ్ లు చేసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలోనిలిచింది.



హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వికారాబాద్ లోని తాండూర్ కు చెందిన ఇమ్రోజ్ పటేల్, కొన్ని సంవత్సరాలుగా రాజేంద్రనగర్ లోని పరమా రెడ్డి హిల్స్ లో ఉంటున్నాడు. అతను సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే.. అక్కడ పనిచేస్తున్న మరో యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు కలిసి ఉండేవాడు. ఇమ్రోజ్ పటేలో ఆ యువతి  తన సర్వస్వం అనుకున్నాడు. ఆ యువతిని పెళ్లి చేసుకుని మంచి జీవితం లీడ్ చేయాలని భావించాడు. కానీ ఇటీవల కాలంలో యువతి.. అతడిని దూరంగా ఉంచడం గమనించాడు. ఫోన్ కాల్స్ పట్టించుకోకపోవడం, మరో యువడితో చనువుగా ఉన్నట్లు తెలుసుకున్నాడు.


Read More: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...


ఇదే విషయంలో వీరు పలుమార్లు గొడవలు కూడా పడ్డారు. ఈ క్రమంలో.. ఇమ్రోజ్ పటేల్.. నిన్న మంగళవారం యువతికి వీడియో కాల్ చేశాడు. అంతేకాకుండా.. ప్రియురాలితో చివరగా మాట్లాడాడు.. తన జీవితం ముగించుకుంటున్నట్లు కూడా చెప్పాడు. దీంతో యువతిటెన్షన్ లో మరో యువకుడికి ఫోన్ చేసి ఫ్లాట్ కు వెళ్లమని చెప్పింది. ఇమ్రోజ్ గదిలొకి వెళ్లి చూడగా అతను ఊరివేసుకుని కన్పించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. యువతి మరో యువకుడితో చనువుగా ఉండటం వల్లనే ఇమ్రోజ్ చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter