Hyderabad Northzone Task Force Police arrested Man for cheating women on social media as a NRI: ప్రేమ, సహజీవనం పేరుతో యువతులను ట్రాప్ చేస్తూ వారి దగ్గరి నుంచి బంగారం, డబ్బు తీసుకుని ఉడాయిస్తున్న కేటుగాడిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 9 లక్షలకు పైగా విలువైన బంగారు నగలు, (Gold jewelry) 2 సెల్‌‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) తుని (Tuni) మండలం హంసవరానికి చెందిన షేక్‌‌ మహ్మద్ రఫి (Mohammed Rafi) అలియాస్ కార్తీక్‌‌ వర్మ(29) (Karthik Varma) పాలిటెక్నిక్ కోర్సును మధ్యలోనే ఆపేశాడు. 2010 ఆగస్టులో హైదరబాద్‌కు వచ్చి ప్రైవేటు జాబ్ చేశాడు. 2017లో నెల్లూరు జిల్లా (Nellore District) గూడూరుకి చెందిన యువతితో పెళ్లి అయ్యింది. భార్యను కట్నం కోసం వేధించడంతో ఆమె గూడూరులో మహ్మద్ రఫిపై కేసు పెట్టింది. దీంతో భార్యను గూడూరులో వదిలేసి రఫి మళ్లీ హైదరాబాద్‌కు వచ్చాడు. తర్వాత ఇక్కడ సులభంగా డబ్బు సంపాదించేందుకు అడ్డదారులు ఎంచుకున్నాడు. విలాసవంతంగా బతకడానికి అలవాటుపడిన రఫీ అందుకు అవసరమైన డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడు. యువతులను ట్రాప్ చేయడం మొదలుపెడ్టాడు రఫీ.


ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో (Instagram) కార్తీక్ వర్మ196 పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అమ్మాయిలతో పరిచయాలు ఏర్పరుచుకోవడం మొదలుపెట్టాడు. అలాగే తన బట్టతలను కవర్ చేసేందుకు విగ్గు పెట్టుకునేవాడు. ఆ విగ్గుతో (Wig) దిగిన ఫొటోలను ఫేస్ బుక్, ఇన్ స్టాలో తాను ట్రాప్ చేసిన యువతులకు పంపేవాడు.తాను యూఎస్​లో (US) పుట్టానంటూ.. చిన్నతనంలోనే హైదరాబాద్ కి వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యానంటూ అమ్మాయిలను నమ్మించేవాడు. తన తల్లి సింగపూర్‌‌‌‌లో డాక్టర్‌‌‌‌గా పని చేస్తోందంటూ వారితో మాయమాటలు చెప్పేవాడు రఫీ.


Also Read : Sajjanar Warning: అల్లు అర్జున్‌కు వార్నింగ్ ఇచ్చిన సజ్జనార్, ఎందుకంటే
ఇక తన ట్రాప్ లో (Trap) పడ్డ యువతులను పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించేవాడు. ప్రేమ, సహజీవనం పేరుతో వారిని మోసం చేసేవాడు. వారి నుంచి నుంచి బంగారం, వెండి, డబ్బులు (Money) తీసుకుని ఉడాయించేవాడు. వాళ్ల ఫోన్‌‌ నంబర్లను బ్లాక్ లిస్ట్‌‌లో (Blacklist‌) పెట్టి తప్పించుకుని తిరిగేవాడు. ఇలా చాలా మంది అమ్మాయిలు రఫీ వల్ల మోసపోయారు. ఈ క్రమంలో ఎస్‌‌ఆర్‌‌‌‌నగర్‌‌‌‌కి చెందిన ఓ యువతిని మహ్మద్ రఫి మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు (Case) ఫైల్ నమోదు చేశారు. నార్త్‌‌జోన్‌‌ టాస్క్‌‌ఫోర్స్‌‌ పోలీసులు (Northzone Task Force Police) దర్యాప్తు చేపట్టి తాజాగా మహ్మద్ రఫీని అదుపులోకి తీసుకున్నారు.


Also Read : Telangana: రేపు విడుదలవుతున్న కేసీఆర్ బయోపిక్, సినిమాలో ఏముంది అసలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook