Hyderabad Gang Rape: హైదరాబాద్ లో వరుసగా అత్యాచార ఘటనలు వెలుగుచూస్తున్నాయి. జూబ్లీహిల్స్ లోని అమ్నేషియా పబ్ కు వచ్చిన మైనర్ బాలికను ట్రాప్ చేసి కారులోనే గ్యాంగ్ రేప్ చేసిన ఘటన తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనమైంది. ఈ కేసులో పోలీసులు విచారణ సాగే కొద్ది సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులోనే వీడియోలు బయటపెట్టారంటూ వచ్చిన ఫిర్యాదుపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపైనా ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పబ్ కేసు కలకలం కొనసాగుతుండగానే నెక్లెస్ రోడ్డులో కారులో అత్యాచార ఘటన బయటికి వచ్చింది. సికింద్రాబాద్ పరిధిలోని కార్ఖానాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన రచ్చ ఉండగానే.. కార్ఖానా గ్యాంగ్ రేప్ ఘటన బయటికి రావడం హైదరాబాదీలను ఉలిక్కిపడేలా చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కార్ఖానాలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్ పోలీసులు ఖండించారు. గ్యాంగ్ రేప్ జరగలేదని.. బాలికను మాయమాటలతో లోబరుచుకుని నిందితులు పలుసార్లు లైంగిక దాడి చేశారని చెప్పారు. పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం బాధితురాలితో ధీరజ్‌, రితేశ్‌ అనే యువకులకు సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది. తర్వాత ఆమెతో ఫ్రెండ్ షిప్ చేశారు. మాయమాటలతో మభ్య పెట్టి తమ లైంగిక వాంఛ తీర్చుకున్నారు నిందితులు. బాలికను లాడ్జికు తీసుకువెళ్లి పలుసార్లు అత్యాచారం చేశారు. బాలికపై లైంగిక దాడి చేసే సమయంలో వీడియోలు తీసిన నిందితులు.. ఆ వీడియోలను చూపించి భయపెడుతూ పలుసార్లు లైంగిక దాడి చేశారు. వీడియోలు ఇస్తామని పిలిచి.. వాళ్ల స్నేహితులతోనూ అత్యాచారం చేయించారు నిందితులు.  


ఈ ఘటన రెండు నెలల క్రితం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత బాధితురాలు మానసికంగా కుంగిపోయారు. దీంతో ఆమెను తల్లిదండ్రులు సైక్రియాటిస్ట్ కు చూపించారు. అతను బాలిక నుంచి వివరాలు రాబట్టగలిగారు. తన కూతురిపై అత్యాచారం జరిగిందని తెలుసుకున్న పేరెంట్స్.. గత నెల 30వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో విచారణ చేపట్టిన పోలీసులు... అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో మైనర్లు ఉండగా వాళ్లను జూవైనల్ హోమ్ కు తరలించిన పోలీసులు.. మిగితా ముగ్గురు నిందితులను పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 


Read also:Telangana Jobs: తెలంగాణలో కొలువుల జాతర.. మరో 1433 పోస్టుల భర్తీ!


Read also: Pakistan Arms To Adilabad: ఆదిలాబాద్ కు పాకిస్తాన్ నుంచే ఆయుధాలు! ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook