Hyderabad Police Couple Pre-wedding Shoot: హైదరాబాద్:సెప్టెంబర్ 23 హైదరాబాద్‌కు చెందిన పోలీస్ దంపతుల ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోనే ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడం, పోలీస్ డ్రెస్‌లో ఫొటోలకు ఫోజులు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. పోలీస్ వెహికల్‌ నుంచి కిందకు దిగుతున్నట్లు ఫొటోలు తీయించుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. నెటిజెన్స్ నుంచి భారీ స్పందన లభించడంతో కాబోయే హైదరాబాద్ పోలీసు దంపతుల ప్రీవెడ్డింగ్ షూట్ వీడియో సోషల్ మీడియాలో ఓ హాట్ టాపిక్ గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియోలో పోలీసు వాహనం, పోలీసు యూనిఫాం, పోలీస్ స్టేషన్‌ను ఉపయోగించుకోవడం ఏంటని నెటిజన్లు మండిపడ్డారు. ఈ పోలీస్ దంపతులు బాధ్యతలు మరిచి ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి.


ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, విమర్శలు దారి తీసిన నేపథ్యంలో తాజాగా పోలీస్ దంపతులు ఎస్‌ఐ భావన, రావు కిషోర్ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.


ఈ సందర్భంగా ప్రీ వెడ్డింగ్ షూట్‌కు పోలీస్ డ్రెస్, వెహికల్, పోలీసుల ప్రాపర్టీ ఉపయోగించుకోవడంపై ఆయనకు క్షమాపణలు చెప్పారు. తమ తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పినట్టుగా తెలిసింది. ఈ సందర్భంగా కాబోయే దంపతులను ఆశీర్వదించిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. జీవితంలో సంతోషంగా ఉండాలని కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పి పంపించారు.